Begin typing your search above and press return to search.

జవాన్ భారీ డీల్.. రిస్క్ చేస్తున్నారా..?

ఏపీ, తెలంగాణా మొత్తం 50 నుంచి 60 కోట్ల దాకా బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. పెన్ ఫిలిమ్స్ వారు జవాన్ మీద భారీ బెట్ పెట్టారని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   23 Aug 2023 6:34 AM GMT
జవాన్ భారీ డీల్.. రిస్క్ చేస్తున్నారా..?
X

పఠాన్ తో హిట్ ఫాం లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ మరో రెండు వారాల్లో జవాన్ అంటూ రాబోతున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను షారుఖ్ సొంత ప్రొడక్షన్ లో నిర్మించారు. షారుఖ్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించారు. సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా దీపిక పదుకొనె కూడా నటించింది. పఠాన్ తో మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినా చూపించిన షారుఖ్ ఆ క్రేజ్ తో జవాన్ సినిమా బిజినెస్ తో అదరగొట్టేస్తున్నాడు.

ఇప్పటికే సినిమా బిజినెస్ మైండ్ బ్లాక్ అయ్యేలా జరిగిందని తెలుస్తుంది. అయితే ఏపీ, తెలంగాణాలో పెన్ ఫిలంస్ డిస్ట్రిబ్యూటర్స్ భారీ ధరకు జవాన్ హక్కులను తీసుకున్నారట. నైజాం ఏరియాలోనే జవాన్ రైట్స్ భారీగా పలికాయని తెలుస్తుంది. ఏపీ, తెలంగాణా మొత్తం 50 నుంచి 60 కోట్ల దాకా బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. పెన్ ఫిలిమ్స్ వారు జవాన్ మీద భారీ బెట్ పెట్టారని చెప్పొచ్చు. తెలుగు బాక్సాఫీస్ దగ్గర హిందీ సినిమాలు ఏమంత ప్రభావం చూపించలేవు.

అయితే డైరెక్టర్ అట్లీ సినిమాలు తెలుగులో మంచి విజయాలనే అందుకున్నాయి. ఇక్కడ షారుఖ్ తో పాటుగా అట్లీ కూడా జవాన్ సినిమాకు యాడ్ అవడంతో తెలుగులో ఈ సినిమాపై సాధారణంగానే అంచనాలు పెరిగాయి. అయితే ఎంత క్రేజ్ ఉన్నా షారుఖ్ సినిమా 60 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందా అన్న డౌట్ మాత్రం ఉంది. ఈమధ్య కంటెంట్ ఉన్న సినిమాలు భాషతో సంబంధం లేకుండా హిట్ చేస్తున్నారు. స్టార్ సినిమా అయితే ఆ ఇంప్యాక్ట్ వేరేలా ఉంటుంది. షారుఖ్ జవాన్ కూడా ఆ కోవలోకే వచ్చేలా ఉంది.

పఠాన్ హిట్ తో షారుఖ్ కూడా ఇన్నేళ్ల ఆకలి తీర్చుకున్నాడు. జవాన్ ని కూడా పనిలో పనిగా హిట్ చేసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరి షారుఖ్ జవాన్ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అన్నది రిలీజ్ అయితేనే చెప్పగలం. జవాన్ తో పాటుగా షారుఖ్ డుంకీ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ముందు డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేసినా ఇప్పుడు 2024 సమ్మర్ కి వాయిదా వేసే ఛాన్స్ లు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి సక్సెస్ ఫాం లో కి వచ్చిన షారుఖ్ వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయాలని ఫిక్స్ అయ్యాడని చెప్పొచ్చు.