పాకిస్తాన్‌కి కాదు నరకానికి పోతాను: పాపులర్ లిరిసిస్ట్
నరకానికి పోతావా? పాకిస్తాన్ కి పోతావా? అని అడిగితే నేను నరకానికే వెళతానని అన్నారు ప్రముఖ లిరిసిస్ట్ జావేద్ అక్తర్.
By: Tupaki Desk | 18 May 2025 11:37 AM ISTనరకానికి పోతావా? పాకిస్తాన్ కి పోతావా? అని అడిగితే నేను నరకానికే వెళతానని అన్నారు ప్రముఖ లిరిసిస్ట్ జావేద్ అక్తర్. తనకు హిందూ దేశంతో పాటు పాకిస్తాన్ వైపు నుంచి ఎదురైన అవమానాలు, అగౌరవం గురించి ఈ వెటరన్ లిరిసిస్ట్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసారు. ``ఒక వర్గం నన్ను కాఫిర్ అని పిలుస్తుంది.. నేను నరకానికి వెళ్తాను అని చెబుతుంది. మరొక వర్గం నన్ను జిహాదీ అని పిలుస్తుంది.. నన్ను పాకిస్తాన్‌కు వెళ్లమని అడుగుతుంది. నా ఎంపికలు నరకం లేదా పాకిస్తాన్ ఏదో ఒకటి అయితే.. నేను నరకాన్ని ఎంచుకుంటాను`` అని అన్నారు.
ఒక కవి తన నోటి నుంచి పలికిన ఈ మాటలు నిజంగా అందరినీ నవ్వించాయి.. అదే సమయంలో ఆలోచింపజేసాయి. హిందూ దేశంలో ముస్లిముల అభద్రతను కూడా అతడి వ్యాఖ్యలు బహిర్గతం చేసాయి. ముఖ్యంగా ఇండియా వర్సెస్ పాక్ వార్ ముదిరిన తర్వాత జావేద్ వ్యాఖ్యలు అందరినీ ఆలోచనలో పడేసాయి. అయితే అతడు తనకు పాకిస్తాన్ నుంచి థ్రెట్ ఉందని చెప్పడం ఆశ్చర్యపరిచింది.
తనను ద్వేషించేవాళ్లు ఉన్నట్టే హిందూ దేశంలో మద్ధతుగా నిలిచిన వారు ఉన్నారని జావేద్ సర్ అంగీకరించాడు. కేవలం విమర్శించేవారే కాదు.. నన్ను సమర్థించే, ప్రశంసించే, ప్రోత్సహించే వారు కూడా చాలా మంది ఉన్నారు అని అతడు చెప్పాడు.
తీవ్రవాద దుర్మార్గంపైనా జావేద్ ఆందోళన వ్యక్తం చేసారు. జావద్ అక్తర్ తనను చాలామంది ఎలా తప్పుగా అర్థం చేసుకున్నారో, ఇది ప్రజలకు ఎలా ఒక సాధారణ లక్షణంగా మారిందో వివరించాడు. రెండు వైపులా ఉన్న తీవ్రవాదులు నాపై దాడి చేస్తారు. ఎవరో ఒకరు అయినా నన్ను విడిచిపెడితే ఎక్కడో తప్పు జరిగిందని నేను తెలుసుకుంటాను! అని తనదైన వ్యంగ్యాన్ని ప్రదర్శించారు.
ఇండియా- పాక్ రెండు వైపుల నుంచి తాను సమస్యలు ఎదుర్కొన్నట్టు జావేద్ తెలిపారు. 2010 నుండి 2016 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేసిన జావేద్ అక్తర్, మతం, రాజకీయాలు, సామాజిక సమస్యలపై ఫిట్లర్ లెస్ గా ధైర్యంగా వ్యాఖ్యానిస్తూ గొప్ప గౌరవం అందుకున్నారు. సూటిగా మాట్లాడే ఆయన నైజం అందరికీ నచ్చింది. తాజా ఈవెంట్లో సంజయ్ రౌత్ రాసిన తాజా పుస్తకం `నార్కట్ల స్వర్గ్` ఆవిష్కరణ అబ్బురపరిచింది.
