Begin typing your search above and press return to search.

అతని సైలెన్స్ ని ఫ్యాన్స్ భరించలేకపోతున్నారు..?

ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది. ఈ సినిమా కోసం అనుదీప్ ఎలాంటి కథ చెప్పబోతున్నాడన్నది ఆడియన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

By:  Tupaki Desk   |   28 Feb 2024 2:45 AM GMT
అతని సైలెన్స్ ని ఫ్యాన్స్ భరించలేకపోతున్నారు..?
X

జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అనుదీప్ ఆ సినిమా సక్సెస్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగు సినిమాకు వరల్డ్ వైడ్ గుర్తింపు వచ్చేలా చేసిన దర్శక ధీరుడు రాజమౌళికి అయినా తెలుగులో యూత్ ఆడియన్స్ ఫాలోయింగ్ ఉందో లేదో కానీ అనుదీప్ కి మాత్రం బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. జాతిరత్నాలు టైం లో అతను క్యాష్ షో లో చేసిన కామెడీ అతన్ని ఆడియన్స్ కి మరింత దగ్గర చేసింది. జాతిరత్నాలు తర్వాత కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశాడు అనుదీప్.

ఆ సినిమా తెలుగులో పర్వాలేదనిపించినా తమిళ ఆడియన్స్ దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. ఓవరాల్ గా ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అయినా కూడా అనుదీప్ కెరీర్ ని డైలమాలో పడేసిందని అనుకున్నారు. లేటెస్ట్ గా అనుదీప్ డైరెక్షన్ లో రవితేజ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. రీసెంట్ గా ఈగల్ ఈవెంట్ లో రవితేజ కూడా చూచాయగా చెప్పేశాడు.

ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది. ఈ సినిమా కోసం అనుదీప్ ఎలాంటి కథ చెప్పబోతున్నాడన్నది ఆడియన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అనుదీప్ సినిమా అంటేనే యూత్ ఆడియన్స్ లో ఒక రకమైన ఎనర్జీ వచ్చేస్తుంది. ఆమధ్య జాతిరత్నాలు సీక్వెల్ కోసం అనుదీప్ ని ట్రెండ్ చేశారు నెటిజన్లు. అయితే జాతిరత్నాలు 2 ఉంటుంది కానీ దానికి కథ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వాలని చెప్పుకొచ్చాడు అనుదీప్.

రవితేజ సినిమా కూడా అనుదీప్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తుంది. రవితేజ ఈమధ్య సీరియస్ కథలు చేస్తున్నాడు కానీ ఆయన మార్క్ కామెడీ సినిమాలు చేస్తే మాత్రం మాస్ రాజా ఫ్యాన్స్ సూపర్ హిట్ చేస్తారు. ధమాకా తర్వాత మళ్లీ రవితేజ అనుదీప్ సినిమాతోనే అలాంటి అటెంప్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు.

మాస్ రాజా కామెడీ డైరెక్టర్ ఈ కాంబో సినిమా అంటేనే ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది. సినిమాలో మిగతా కాస్టింగ్ ఎవరన్నది త్వరలో బయటకు వస్తుంది. రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనుదీప్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.