Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్‌కు హైప్.. డైరెక్టర్‌కు డౌట్..జాతిరత్నాలు 2 అప్డేట్

తాజాగా నిర్మాత నాగ్ అశ్విన్ ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అసలు ఈ ముగ్గురు మిత్రుల కథ ఎటు తిరగబోతోంది? సీక్వెల్ ఉందా లేదా? అన్న ఆసక్తికరమైన అప్డేట్స్ చూద్దాం.

By:  Madhu Reddy   |   8 Jun 2026 12:15 PM IST
ఫ్యాన్స్‌కు హైప్.. డైరెక్టర్‌కు డౌట్..జాతిరత్నాలు 2 అప్డేట్
X

టాలీవుడ్ లో జాతి రత్నాలు కామెడీ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా? 2021లో నవ్వులతో థియేటర్లను కదిలించిన మూవీ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతుండగా, తాజాగా నిర్మాత నాగ్ అశ్విన్ ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అసలు ఈ ముగ్గురు మిత్రుల కథ ఎటు తిరగబోతోంది? సీక్వెల్ ఉందా లేదా? అన్న ఆసక్తికరమైన అప్డేట్స్ చూద్దాం.

జోగిపేట రత్నాల మ్యాజిక్:

నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. ఈ ముగ్గురూ కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సిల్లీ కామెడీతో, చిన్న పాయింట్‌ను పట్టుకుని డైరెక్టర్ అనుదీప్ కె.వి. సినిమాను సూపర్ హిట్ చేశారు. 'చిట్టి'గా ఫరియా అబ్దుల్లా తన క్యూట్ యాక్టింగ్‌తో కుర్రాళ్ళ మనసు దోచేసింది. ఎలాంటి లాజిక్ లేకపోయినా, కేవలం మ్యాజిక్ లాంటి కామెడీతో ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాలీవుడ్‌ను ఆశ్చర్యపరిచింది.

నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్:

జాతిరత్నాలు 2 కోసం అనుదీప్ స్క్రిప్ట్ రాస్తున్నారని, నాగ్ అశ్విన్ సాయం చేస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. అయితే, నాగ్ అశ్విన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "కమర్షియల్‌గా జాతిరత్నాలు 2 చేయవచ్చు, కానీ ప్రస్తుతానికి మా దగ్గర సరైన కథ లేదు" అని నిజాయితీగా చెప్పేశారు. ఇక దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొదటి భాగంలో మాత్రం కథ ఎక్కడుంది, కామెడీ ఉంటే చాలు కదా అని కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

కల్కి హ్యాంగోవర్.. జాతిరత్నాల వెయిటింగ్:

ప్రస్తుతం నాగ్ అశ్విన్ 'కల్కి 2898 AD' భారీ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆయన దృష్టి అంతా కల్కి పార్ట్ 2 మీదనే ఉంది. ఈ మైథాలజీ అండ్ ఫ్యూచరిస్టిక్ మూవీ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక 2027 డిసెంబర్‌లో కల్కి 2ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్యాప్‌లో జాతిరత్నాలు సీక్వెల్ పట్టాలెక్కుతుందా లేదా అన్నది అనుదీప్ రాసే ఆ "స్ట్రాంగ్ స్టోరీ" మీదనే ఆధారపడి ఉంది.

ఏది ఏమైనా 'జాతిరత్నాలు 2' ప్రాజెక్ట్ అయితే క్యాన్సిల్ అవ్వలేదు కానీ, కన్ఫామ్ గా ఎప్పుడు వస్తుందనే దానిపై క్లారిటీ లేదు. నాగ్ అశ్విన్ కల్కి పనుల్లో, నవీన్ పొలిశెట్టి తన ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ ఈ క్రేజీ కాంబో మళ్ళీ సెట్స్ మీదకు వస్తే థియేటర్లలో నవ్వుల పూత పూయడం ఖాయం.