‘జాతస్య మరణం ధ్రువం’: ఇంట్రో గ్లింప్స్ తో థ్రిల్లర్ ట్రీట్
టాలీవుడ్ సినీ పరిశ్రమలో విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి.
By: Tupaki Desk | 9 Jan 2025 4:51 AM GMTటాలీవుడ్ సినీ పరిశ్రమలో విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ఇక త్వరలోనే, ‘జాతస్య మరణం ధ్రువం’ అనే డిఫరెంట్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జెడి చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు శ్రవణ్ జొన్నాడ దర్శకత్వం వహించారు. సురక్ష్ బ్యానర్‌పై మల్కాపురం శివ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది.
అనేక భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక లేటెస్ట్ గా ఇంట్రో గ్లింప్స్ తో పాత్రలను పరిచయం చేసిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి ‘జాతస్య మరణం ధ్రువం’ అనే పవర్ఫుల్ టైటిల్ తోనే మేకర్స్ ఎట్రాక్ట్ చేశారు. సంస్కృతం నుండి ఆవిర్భవించిన ఈ పదబంధం “పుట్టినవారికి మరణం తప్పదు” అనే అర్థాన్ని కలిగి ఉంది.
ఈ టైటిల్‌ను వినగానే సినిమా కథలో ఎలాంటి మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండబోతాయో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. అలాగే ఇంట్రో గ్లింప్స్ కూడా అదే ఆసక్తిని మరింత పెంచింది. జెడి చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ ఇంటెన్స్ లుక్స్‌తో నిండిన గ్లింప్స్ సినిమా కంటెంట్ ను ముందుగానే చూపిస్తోంది. సినిమాకు ఘిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రక్తి కట్టించేలా ఉంది. మిస్టరీ, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడిన పాత్రలు అద్భుతంగా చూపించబడ్డాయి.
ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జంఘియాని కూడా రీఎంట్రీ ఇస్తున్నారు. రాజేష్ శర్మ, తనికెళ్ల భరణి వంటి సీనియర్ నటులు తమ పాత్రలతో చిత్రానికి మరింత బలం చేకూరుస్తారు. అర్జున్ రాజా సినిమాటోగ్రఫీ, జిబ్రాన్ మరియు రాజ్ ఆషూ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. విప్లవ్ నైషధం ఎడిటింగ్ బాధ్యతలను, రాజేష్ మందాపురం ఆర్ట్ డైరక్షన్‌ను సమర్థంగా నిర్వహించారు.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు క్రియేట్ ఐయ్యేలా ప్రమోషన్స్ కు ప్లాన్ చేస్తోంది. సీరియస్ ఎమోషన్స్, థ్రిల్లింగ్ సీక్వెన్సెస్, మిస్టరీ-డ్రివెన్ కథ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. మరి ‘జాతస్య మరణం ధ్రువం’ సినిమా ప్రేక్షకుల హృదయాలను ఎలా కదిలిస్తుందో చూడాలి.