Begin typing your search above and press return to search.

విజ‌య్ కొడుకు డైరెక్ష‌న్ కు ఫ్యాన్స్ ఫిదా!

ఈ వీడియోలో సందీప్ ను జాస‌న్ సంజ‌య్ డైరెక్ట్ చేసిన విజువ‌ల్స్ ను చూసి విజ‌య్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 May 2025 8:56 AM
విజ‌య్ కొడుకు డైరెక్ష‌న్ కు ఫ్యాన్స్ ఫిదా!
X

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ప‌లువురు హీరోలున్న‌ప్ప‌టికీ స్టార్ హీరోల కొడుకులు ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తారా అని అందరూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. వారి ఆస‌క్తితో సంబంధం లేకుండా ఫ్యాన్సే ఆ హీరోల వార‌సుల ఫ్యూచ‌ర్ ను కూడా డిసైడ్ చేసేసి ఫ‌లానా జాన‌ర్ సినిమాతో డెబ్యూ ఇస్తే అదిరిపోతుంద‌ని స‌ల‌హాలు కూడా ఇస్తుంటారు.

కానీ అంద‌రూ త‌మ తండ్రుల బాట‌లోనే న‌డ‌వాల‌ని రూలేం లేదు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు జాస‌న్ సంజ‌య్ అదే చేస్తున్నాడు. త‌న తండ్రి అంత పెద్ద స్టార్ అయిన‌ప్ప‌టికీ తాను మాత్రం హీరో అవాల‌నుకోవ‌డం లేదు. మెగాఫోన్ చేత ప‌ట్టి డైరెక్ట‌ర్ అవాల‌ని డిసైడ్ అయి దానిపై వ‌ర్క్ చేస్తూ వ‌చ్చాడు.

జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో సందీప్ కిష‌న్ హీరోగా సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. కొన్ని రోజుల కింద‌టే ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాకు మేక‌ర్స్ ఇంకా టైటిల్ ను ఫిక్స్ చేయ‌లేదు. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వ‌చ్చింది.

మే 7న హీరో సందీప్ కిష‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మేక‌ర్స్ ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి సందీప్ కు బ‌ర్త్ డే విషెస్ ను తెలియ‌చేశారు. మేకింగ్ వీడియో చూస్తుంటే ఈ సినిమా యాక్ష‌న్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. ఈ వీడియోలో సందీప్ ను జాస‌న్ సంజ‌య్ డైరెక్ట్ చేసిన విజువ‌ల్స్ ను చూసి విజ‌య్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.

సందీప్ కిష‌న్ కెరీర్లో 31వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా మేకింగ్ వీడియో చూస్తుంటే సంజ‌య్ టేకింగ్ అదిరిపోయేలా అనిపిస్తోంది. ఈ సినిమాలో హైద‌రాబాద్ అమ్మాయి ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. కాగా సంజ‌య్ లండ‌న్‌లో స్క్రీన్ రైటింగ్ విభాగంలో బి.ఎ తో పాటూ, టోరంటో ఫిల్మ్ స్కూల్ లో ఫిల్మ్ ప్రొడ‌క్ష‌ణ్ డిప్లొమా కంప్లీట్ చేశాడు. అందుకే ఎక్స్‌పీరియెన్స్ లేక‌పోయినా ఎలాంటి టెన్ష‌న్ లేకుండా సినిమాను పూర్తి చేస్తున్న‌ట్టు క‌నిపిస్తున్నాడు.