విజయ్ తనయుడు గేర్ మార్చేస్తున్నాడా?
స్టార్ హీరోల వారసులు అంతా హీరోలుగా అరంగేట్రం చేస్తూ స్టార్‌లుగా మారుతున్నవేల అందరికి భిన్నంగా అడుగులు వేస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్.
By: Ravindar Gorantla | 14 March 2026 1:28 PM ISTస్టార్ హీరోల వారసులు అంతా హీరోలుగా అరంగేట్రం చేస్తూ స్టార్‌లుగా మారుతున్నవేల అందరికి భిన్నంగా అడుగులు వేస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్. అందరూ ఊహించినట్టు హీరోగా కాకుండా డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అంతా షాక్ అయ్యారు. కోలీవుడ్‌లో విజయ్ స్టార్ హీరో. తన తనయుడేంటీ హీరోగా అరంగేట్రం చేయకుండా ఇలా డైరెక్టర్ అవతారం ఎత్తుతున్నాడేంటీ?..తనకు హీరోగా నటించాలని లేదా? తన తండ్రి విజయ్ లెగసీని, స్టార్ డమ్‌ని కంటిన్యూ చేయలని లేదా? అనే కామెంట్‌లు వినిపించాయి.
అయితే జాసన్ సంజయ్ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోకుండా తను అనుకున్నట్టుఆనే డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. తను ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తున్న మూవీ `సిగ్మా`. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ మూవీ. కేథరిన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఇతర కీలక పాత్రల్లో రాజు సుందరం, సంపత్ రాజ్, అన్బు థాసన్, శివమ్ పండిత్, యోగ్ జాపీ తదితరులు నటిస్తున్నారు. జెన్‌జీ స్టైల్ యాక్షన్ డ్రామాగా దీన్ని సరికొత్త పంథాలో జాసన్ సంజయ్ తెరకెక్కిస్తున్నాడు.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ అందరిని ఆకట్టుకోవడంతో సినిమాపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలోనే మూవీని భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని జాసన్ విజయ్ ప్లాన్ చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. కేథరిన్, సందీప్ కిషన్‌లపై ఈ పాటని ప్రత్యేకంగా షూట్ చేయబోతున్నారు.
అయితే ఈ స్పెషల్ నంబర్‌లో వీరితో పాటు జాసన్ విజయ్ కూడా స్పెషల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలిసింది. దీంతో విజయ్ అభిమానులు జాసన్ విజయ్ స్పెషల్ ఎంట్రీపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న జాసన్ విజయ్ స్పెషల్ సాంగ్‌లో ప్రత్యేకంగా ఎంట్రీ ఇస్తుండటంతో అందరిలోనూ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముందు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చేసి ఆ తరువాత హీరోగా రంగంలోకి దిగాలని జాసన్ విజయ్ గేర్ మార్చి ప్లాన్ మార్చేస్తున్నాడా? ..తనకూడా హీరోగా అరంగేట్రం చేయాలని ఉందా? అని కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అంతా భావిస్తున్నట్టే జాసన్ విజయ్ `సిగ్మా` తరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చేసి తన తండ్రి దళపతి విజయ్ లెగసీని కంటిన్యూ చేస్తాడా? లేక ఇటీవల తండ్రి విజయ్ షాక్ ఇచ్చినట్టే అభిమానులకు షాక్ ఇచ్చి డైరెక్టర్‌గానే కంటిన్యూ అవుతాడా? అన్నది వేచి చూడాల్సిందే. `ఊరు పేరు భైరవ కోన తరువాత మరో సక్సెస్‌ని ఖాతాలో వేసుకోని సందీప్ కిషన్ ఈ మూవీతో మళ్లీ ట్రాక్‌లోకి రావాలని భావిస్తున్నాడు.
