Begin typing your search above and press return to search.

జరగండి పాటకు అన్నీ కోట్లు ఖర్చు చేశారా?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 March 2024 9:21 AM GMT
జరగండి పాటకు అన్నీ కోట్లు ఖర్చు చేశారా?
X

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివర దశలో ఉంది. ఎప్పుడో మూడేళ్ల క్రితం పట్టాలెక్కిన ఈ మూవీ.. ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అప్పుడెప్పుడో టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా చెర్రీ పుట్టిన రోజు నాడు మరో అప్డేట్ ఇచ్చారు.

గత ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తామని ప్రకటించిన జరగండి సాంగ్ ను నేడు రిలీజ్ చేశారు గేమ్ ఛెేంజర్ మేకర్స్. తమన్ సంగీతం అందించిన ఈ సాంగ్.. గతంలో సోషల్ మీడియాలో లీక్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు వేరే సింగర్స్ తో పాడించిన ఈ సాంగ్ ను ఇప్పుడు.. దలేర్ మెహింది, సునీత చౌహన్ తో తమన్ పాడించారు. ఈ లిరికల్ సాంగ్ లో హీరోహీరోయిన్లు రామ్ చరణ్, కియారా అద్వానీ స్టైలిష్ గా స్టెప్పులు వేసి అదరగొట్టారు.

అయితే జరగండి జరగండి పాటకు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్ కు మేకర్స్.. ఏకంగా రూ.16 కోట్లు నుంచి రూ.18 కోట్లు ఖర్చు చేశారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక పాట బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తున్న కలర్ ఫుల్ భవనాలు సెట్సే కానీ.. ఒరిజినల్ లొకేషన్స్ లా అనిపిస్తున్నాయి. సెట్స్ తోపాటు గ్రాఫిక్స్ కోసమే భారీ మొత్తంలో మేకర్స్ ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

శంకర్ చేస్తున్న ఫస్ట్ తెలుగు మూవీ గేమ్ ఛేంజర్ కావడం గమనార్హం. ఇప్పటికే భారతీయుడు, ఒకే ఒక్కడు వంటి పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు శంకర్. విన‌య‌ విధేయ‌ రామ సినిమా త‌ర్వాత మరోసారి రామ్ చరణ్ చ‌ర‌ణ్‌, కియారా జంట‌గా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నట్లు సమాచారం.

శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో రామ్ చరణ్.. డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ గా చరణ్ కనిపించబోతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ లో ఈ మూవీ రిలీజ్ చేస్తామని ఇప్పటికే దిల్ రాజు... ప్రకటించారు. కానీ అఫీషియల్ అప్డేట్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఈ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న విషయం తెలిసిందేే. మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.