Begin typing your search above and press return to search.

జ‌పాన్ రాయ‌బారినే అట్టుడికించిన కావాలా..!

హిరోషి సుజుకీ తన X హ్యాండిల్‌లో వీడియోను షేర్ చేసి జపనీస్ యూట్యూబర్ మాయో సాన్‌తో కావాలా డ్యాన్స్ వీడియో.

By:  Tupaki Desk   |   17 Aug 2023 4:34 AM GMT
జ‌పాన్ రాయ‌బారినే అట్టుడికించిన కావాలా..!
X

సూప‌ర్ స్టార్ రజనీకాంత్ చాలా గ్యాప్ త‌ర్వాత క‌సిగా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు. ఈ ఘ‌న‌త‌ను త‌న‌కు సాధ్యం చేసిన ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్. బీస్ట్ లాంటి ఫ్లాప్ సినిమాని ఇచ్చిన దిలీప్ ఇప్పుడు ర‌జ‌నీకి బంప‌ర్ హిట్టిచ్చాడు. జైల‌ర్ ఇంటా బ‌య‌టా క‌లెక్ష‌న్ల దుమారం సృష్టిస్తోంద‌ని ట్రేడ్ విశ్లేషించింది.

ఇక జైల‌ర్ క‌లెక్ష‌న్ల‌ను మించి యూట్యూబ్ లో సామాజిక మాధ్య‌మాల్లో సంచ‌ల‌నంగా మారుతోంది 'కావాలా..' సాంగ్. ఈ పాట‌కు స్టెప్పు క‌లిపేందుకు యువ‌త‌రం ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాల్లో కావాలా సాంగ్ కి అనుకర‌ణ‌లు సంచ‌ల‌నంగా మారుతున్నాయి. ఇప్పుడు ఏకంగా జపాన్ రాయబారి కావాలా సాంగ్ కి కాలు క‌దిపారు.

ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ తో క‌లిసి స్టెప్పులేసారు. భారతదేశంలోని జపాన్ రాయబారి కూడా వైరల్ ట్రెండ్‌లోకి ప్రవేశించి రజనీకాంత్‌పై తన ప్రేమను చూపించాడు. అంబాసిడర్ హిరోషి సుజుకి హుక్ స్టెప్ కోసం పాపుల‌ర్ జపనీస్ యూట్యూబర్ మాయో శాన్‌తో కలిసి పనిచేశారు. ఇప్పుడు ఈ వీడియో అంత‌ర్జాలంలో వైరల్ గా మారుతోంది.

హిరోషి సుజుకీ తన X హ్యాండిల్‌లో వీడియోను షేర్ చేసి జపనీస్ యూట్యూబర్ మాయో సాన్‌తో కావాలా డ్యాన్స్ వీడియో .... రజనీకాంత్‌పై నా ప్రేమ ఇలానే కొనసాగుతోంది అని క్యాప్షన్‌ని పెట్టారు. అంతకుముందు మిస్టర్ సుజుకి సూపర్ స్టార్‌పై తన ప్రేమ‌ను కురిపించారు. ర‌జ‌నీ త‌ర‌హాలో క‌ళ్ల‌ద్దాల‌ను తిప్పుతూ ధ‌రించే 'తలైవర్ ఛాలెంజ్'ని స్వీకరించాడు. ఇక ద‌శాబ్ధాల పాటు జ‌ప‌నీయుల అభిమానాన్ని ర‌జ‌నీకాంత్ చూర‌గొన్నారు.