Begin typing your search above and press return to search.

వీడియో : ఇలాంటి అభిమానులూ ఉంటారా?

ఇలాంటి పిచ్చి అభిమానులు ఉన్నారు ఏంట్రా బాబు అని స్వయంగా హీరోలే అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇదంతా ఇండియాలోనే అనుకుంటే పొరపాటే. ఎన్టీఆర్‌కి జపాన్‌లోనూ ఈ తరహా అభిమానులు ఉన్నారు.

By:  Ramesh Palla   |   20 Aug 2025 4:16 PM IST
వీడియో : ఇలాంటి అభిమానులూ ఉంటారా?
X

ఇండియాలో సినిమా తారలకు అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సౌత్‌ ఇండియన్‌ హీరోలకు అభిమానులు గుడులు, బడులు కట్టిన సందర్భాలు ఉన్నాయి. తమ అభిమాన హీరో పేరు చెప్పి కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు చేసే అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో స్టార్స్‌కి, సూపర్‌ స్టార్స్‌కి ఉన్న అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. తమకు నచ్చిన హీరో కోసం ప్రాణాలు తీయడం, ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. ఇలాంటి పిచ్చి అభిమానులు ఉన్నారు ఏంట్రా బాబు అని స్వయంగా హీరోలే అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇదంతా ఇండియాలోనే అనుకుంటే పొరపాటే. ఎన్టీఆర్‌కి జపాన్‌లోనూ ఈ తరహా అభిమానులు ఉన్నారు.

ఎన్టీఆర్‌ కోసం జపాన్‌ నుంచి..

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ కి జపాన్‌లో విపరీతమైన అభిమానగనం ఏర్పడింది. ఆ సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఖర్చు పెట్టారో తెలిసిందే. జపాన్‌ లో ఇండియన్‌ సినిమాలకు మంచి స్పందన ఉంటుంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అంతకు ముందు సినిమాలు రాబట్టిన వసూళ్లతో పోల్చితే దాదాపుగా అయిదు రెట్లు అధికంగా వసూళ్లు చేసింది అనే విషయం తెల్సిందే. ఆ ఒక్కటి జపాన్‌లో ఎన్టీఆర్‌ కి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎంత ఉందో చెప్పకనే చెబుతోంది. ఎన్టీఆర్‌ ను జపనీస్‌ ఫ్యాన్స్‌ ఎంతో మంది చూసేందుకు ఇండియాకు వస్తూనే ఉంటారు. ఆ మధ్య ఒక జపనీస్ అమ్మాయి ఎన్టీఆర్‌ గురించి మాట్లాడిన వీడియో వైరల్‌ అయిన విషయం తెల్సిందే. అన్న అన్న అంటూ ఎన్టీఆర్‌ను పిలిచిన జపనీస్‌ అమ్మాయి వీడియో సైతం తెగ వైరల్‌ అయింది.

వార్‌ 2 సినిమాను చూడ్డానికి..

ఇప్పుడు మరో జపనీస్‌ అమ్మాయి వీడియో వైరల్‌ అవుతోంది. ఆమె జపాన్ నుంచి ఇండియాకు వచ్చింది. టీ షర్ట్‌ పై ఎన్టీఆర్‌ ఫోటో ఉండటంతో ఎయిర్‌ పోర్ట్‌లో ఒక వ్యక్తి మీరు ఎందుకు ఇండియాకు వచ్చారు అంటూ ప్రశ్నించాడు. అందుకు ఆమె ఎన్టీఆర్‌ అంటే నాకు చాలా అభిమానం. ఆయన సినిమాను చూసేందుకు ఇక్కడకు వచ్చాను అంది. ఇటీవల ఎన్టీఆర్‌ నటించిన వార్‌ 2 విడుదలైన విషయం తెల్సిందే. ఆ సినిమాను చూసేందుకు గాను ఆమె జపాన్ నుంచి ఇండియాకు వచ్చింది. ఒక హీరో సినిమాను చూసేందుకు దేశాలు దాటి వస్తారా అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి అభిమాని ఉండటం నిజంగా ఎన్టీఆర్‌ అదృష్టం అనడంలో సందేహం లేదు. ఆమె వీడియో ప్రస్తతుం సోషల్‌ మీడియాను షేక్ చేస్తుంది. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ తెగ షేర్‌ చేస్తూ ఆమెకి హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో డ్రాగన్‌

ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ మొదటి మూవీ వార్ 2 ఆశించిన స్థాయిలో ఆడలేదు. తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్‌ ఓపెనింగ్స్‌ను రాబట్టినా ఓవరాల్‌గా సినిమా నిరాశను మిగిల్చినట్లే అని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమా విడుదల అయింది. అక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇక ఎన్టీఆర్‌ ప్రస్తుతం చేస్తున డ్రాగన్‌ సినిమాపైనే అందరి దృష్టి ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్‌ సినిమాలో ఎన్టీఆర్‌ లుక్‌ ఓ రేంజ్‌ లో ఉంది. మొదట డ్రాగన్‌ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. 2026 సమ్మర్‌ కి ఖచ్చితంగా డ్రాగన్‌ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి.