Begin typing your search above and press return to search.

నయన్- విఘ్నేష్ మూవీలో జానీ మాస్టర్.. ఇప్పుడిదే హాట్ టాపిక్..

అయితే ఎల్ఐకే మూవీకి కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ వర్క్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   4 July 2025 3:24 PM IST
నయన్- విఘ్నేష్ మూవీలో జానీ మాస్టర్.. ఇప్పుడిదే హాట్ టాపిక్..
X

సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ లో నయనతార- విఘ్నేష్ శివన్ జంట పేరు కచ్చితంగా ఉంటుందనే చెప్పాలి. ఓ మూవీ షూటింగ్ లో పరిచయమైన వీరిద్దరూ.. ఆ తర్వాత మంచి స్నేహితులయ్యారు. ఆపై ప్రేమికులుగా మారి ఏడేళ్లపాటు ప్రేమలో మునిగితేలారు. 2022లో వివాహ బంధంతో ఒకటయ్యారు.

ఆ తర్వాత సరోగసీ పద్ధతిలో ఇద్దరు కుమారులకు పేరెంట్స్ కూడా అయ్యారు. అయితే నయన్, విఘ్నేష్ అటు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే.. ఇటు కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. నయనతార ఇప్పటికే పలు సినిమాల్లో నటిస్తున్నారు. వాటితో బిజీగా ఉన్నారు. మరోవైపు, విఘ్నేశ్ శివన్.. వివిధ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు.

అందులో ఒకటి ఎల్ఐకే (లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ) మూవీ. ప్రదీప్‌ రంగనాథన్‌, కృతిశెట్టి హీరోహీరోయిన్స్‌ గా నటిస్తున్న ఆ సినిమాకు విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ సినిమా.. సెప్టెంబర్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అయితే ఎల్ఐకే మూవీకి కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ వర్క్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని నెలల క్రితం లైంగిక వేధింపుల కేసులో అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చిన జానీ.. ఇప్పుడు కెరీర్ పై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ఎల్ఐకే సినిమాకు పని చేశారు. దీంతో ఇప్పుడు నయన్ జంట విమర్శలు ఎదుర్కొంటోంది.

జానీ మాస్టర్ రీసెంట్ గా తాను ఎల్ఐకే మూవీని పని చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. "లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సెట్స్‌లో విఘ్నేష్ శివన్ సార్ తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన నాపై చూపిన శ్రద్ధ, గౌరవం, నమ్మకం పట్ల సంతోషిస్తున్నారు. మేం క్రియేట్ చేసిన మ్యాజిక్ ను చూపించడానికి వేచి ఉండలేను" అని జానీ తెలిపారు.

దీంతో స్వీట్ మాస్టర్ జీ.. ఎల్ఐకే టీమ్ మిమ్మల్ని, మీ వైబ్‌ ను ప్రేమిస్తుందని విఘ్నేశ్ పెట్టారు. దీంతో ఒక్కసారి కొందరు నెటిజన్లు ఆయనపై ఫైరయ్యారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో కలిసి పనిచేయడానికి ఎంచుకున్నందుకు నిరాశ వ్యక్తం చేశారు. విఘ్నేశ్ తో పాటు నయన్ పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎందుకంటే ఆమె సినిమా నిర్మాతల్లో ఒకరు. గత చిత్రాల్లో మహిళల కోసం వాదించిన ఆమె.. ఇప్పుడు నిందితుడిని ఎలా తీసుకున్నారని అంటున్నారు. నేరస్థులను ప్రేమిస్తున్నట్లు అనిపిస్తుందని గాయని చిన్మయి శ్రీపాద ఆరోపించారు. బెయిల్‌పై బయట ఉన్నారని గుర్తుచేశారు. అయితే జానీపై ఆరోపణలు నిజం కాలేదని.. నిందితుడు మాత్రమేనని ఇంకొందరు అంటున్నారు. వర్క్ చేస్తే తప్పేముందని క్వశ్చన్ చేస్తున్నారు.