Begin typing your search above and press return to search.

జాన్వీక‌పూర్ లో ఇలాంటి క‌ళ కూడా ఉందా?

అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌నయ గా సినిమాల్లోకి వ‌చ్చిన జాన్వీ క‌పూర్ కెరీర్ దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   29 Feb 2024 5:20 AM GMT
జాన్వీక‌పూర్ లో ఇలాంటి క‌ళ కూడా ఉందా?
X

అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌నయ గా సినిమాల్లోకి వ‌చ్చిన జాన్వీ క‌పూర్ కెరీర్ దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. వెనుక తండ్రి బోనీక‌పూర్ సూచ‌న‌లు ....స‌ల‌హాలు పాటిస్తూ కెరీర్ లో బిజీ నాయిక‌గా మారుతుంది. ఇప్ప‌టికే బాలీవుడ్ లో స‌త్తా చాటింది. `దేవ‌ర` సినిమాతో టాలీవుడ్ లోనూ లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ కాక ముందే అమ్మ‌డు తెలుగు అవకాశాలు ఒడిసిప‌ట్టుకుంటుంది.

ఆర్ సీ 16 లో ఈ భామ‌నే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇంకా చాలా అవ‌కాశాలే అమ్మ‌డి కోసం క్యూలో ఉన్నాయి. మ‌మ్మీ ఇమేజ్ తో అవ‌కాశాలు వ‌స్తున్నాయా? ప్ర‌తిభ చూసి అవ‌కాశాలిస్తున్నారా? బోనీ ప్ర‌య త్నాల‌తో సాధ్య‌మ‌వుతుందా? అన్న‌ది తెలియ‌దుగానీ ఛాన్సుల‌కైతే వెతుక్కునే ప‌నిలేకుండా కెరీర్ లో ముంద‌కు సాగిపోతుంది. ఇక జాన్వీ మంచి పెర్పార్మ‌ర్ అని చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే న‌టిగా స‌క్సెస్ అయింది. డాన్సు ప‌రంగానూ న‌వ నాయిక ఏమీ తీసిపోదు.

మ‌రి ఇంకా అమ్మ‌డిలో అంద‌నంగా ఉన్న క్వాలిటీస్ ఏంటి? అంటే కొత్త‌గా స్టాండ‌ప్ క‌మెడియ‌న్ గానూ ట్రై చేసిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా దానికి సంబంధించిన ఓ ప్రోమో వైర‌ల్ అవుతుంది. `లీప్- లాఫ్ & లెర్న్` అంటూ నేడు ఓ వీడియో రిలీజ్ చేస్తుంది. ఇందులో అమ్మ‌డు స్టాండ‌క‌ప్ క‌మెడియ‌న్ గా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేసింది. అయితే ఈ ప్రయ‌త్నం ప‌ట్ల తాను చాలా నమ్మ‌కంగా ఉన్న‌ట్లు తెలిపింది.

అమ్మ‌డు త‌న‌లో ఉన్న దాగిన టైమింగ్ కామెడీని ఈ విధంగా బ‌య‌ట‌కు తేబోతుంది. ప్రోమో వ‌ర‌కూ ఒకే అనిపిస్తుంది. మ‌రి మొత్తం వీడియో రిలీజ్ అయితే జాన్వీ ఎంత గొప్ప స్టాండ‌ప్ క‌మెడియ‌న్ అన్న‌ది తెలుస్తుంది. స్టాండ‌ప్ క‌మెడియ‌న్ గా అమ్మ‌డు ఇప్ప‌టికే స్నేహితుల ముందు ప్రూవ్ చేసుకునే ఉంటుంది. కానీ న‌టిగా ప్ర‌యాణం మొద‌లు పెట్టిన త‌ర్వాత త‌న‌లో ఆ రేర్ క్వాలిటీ కూడా ఉంద‌ని ఇప్పుడే తెలుస్తుంది.