Begin typing your search above and press return to search.

అశ్లీల సైట్ల‌లో నా ఫోటోలు చూసి షాక‌య్యాను!

నా స్నేహితులు నన్ను వేరే విధంగా చూసారు. నన్ను ఎగతాళి చేశారు... వెబ్ సైట్ల‌లో మార్ఫింగ్ ఫోటోలు చూసి, నేను ఎలాగోలా పేరు తెచ్చుకున్నందుకు నేను ఇక‌ పని చేయనవసరం లేదని ఎగతాళి చేసారు.

By:  Tupaki Desk   |   29 Sep 2023 2:10 PM GMT
అశ్లీల సైట్ల‌లో నా ఫోటోలు చూసి షాక‌య్యాను!
X

స్టార్‌గా ఉండడం సులువైన‌ది కాదు.. ఎప్పుడూ స‌మ‌స్యాత్మ‌క‌మైన‌ది. సెల‌బ్రిటీ ఇమేజ్ తో పాటు స‌మ‌స్య‌లు కూడా చుట్టుముడ‌తాయి. అలాంటి ఒక పెను స‌మ‌స్య‌ను తాను ఎదుర్కొన్నాన‌ని జాన్వీ క‌పూర్ చెబుతోంది. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలిగా సినీరంగంలోకి ప్ర‌వేశించిన జాన్వీ క‌పూర్ ఇప్ప‌టికే స్టార్ గా ఓ వెలుగు వెలుగుతోంది. హిందీ ప‌రిశ్రమ‌తో పాటు సౌత్ ఇండ‌స్ట్రీల్లోను స‌త్తా చాటే ప్ర‌య‌త్నాల్లో ఉంది. జూనియ‌ర్ ఎన్టీఆర్- కొర‌టాల కాంబినేష‌న్ మూవీ- దేవ‌ర‌లో జాన్వీ కపూర్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే జాన్వీ క‌పూర్ పేరు అప్పుడ‌ప్పుడు ర‌క‌ర‌కాల‌ కార‌ణాల‌తో మీడియా హెడ్ లైన్స్ లోకొస్తోంది. ఇంత‌కుముందు త‌న ఫోటోలు, త‌న సోద‌రి ఫోటోల‌ను అనుమ‌తి లేకుండా తీసారంటూ ఫోటోగ్రాఫ‌ర్ల‌పై జాన్వీ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు.. తన మార్ఫింగ్ ఫోటోలను అశ్లీల వెబ్ సైట్ల‌లో చూసి షాక్ కి గుర‌య్యాన‌ని జాన్వీ క‌పూర్ వెల్లడించింది. ఇది ఇప్పుడు కాదు.. ఒకానొక‌ప్ప‌టి అనుభ‌వం అని కూడా తెలిపింది.

న్యూస్‌లాండ్రీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో .. నకిలీ మార్ఫ్‌డ్ ఫోటోల‌ ప్రవాహం నేటి అధునాతన AI (కృత్రిమ మేధస్సు)తో మ‌రింత పెరిగింద‌ని జాన్వీ అన్నారు. ప్రజలు ఈ తారుమారు చేసిన ఫోటోలను చూసి అవి వాస్తవమైనవని ఊహిస్తారు. అది నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది.. అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. జాన్వీ పాఠశాలలో చ‌దువుకునే రోజుల్లో త‌న‌ను "ప‌రాయి"గా చూసార‌ని కూడా తెలిపింది. తాను 4వ తరగతి చదువుతున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ.. యాహూ హోమ్‌పేజీలో తన ఫోటోలు తళుక్కున మెరిసాయ‌ని వాటిని చూసినప్పుడు తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని జాన్వీ తెలిపింది. చిత్ర పరిశ్రమలో న‌టిగా ప్రారంభ‌మ‌వుతాన‌ని మీడియా హెడ్ లైన్స్ లో రాసింది. ఆ త‌ర్వాత‌ టీచర్లు కూడా తనతో విభిన్నంగా ప్రవర్తించారని, అది తనకు నచ్చలేదని జాన్వీ పేర్కొంది. స్కూల్ లో ఎదురైన త‌న అనుభ‌వాల‌పై జాన్వీ ఆవేద‌న చెందింది.

నిజానికి అక్క‌డ వారు అర్థం చేసుకున్నారని నేను అనుకోను. ఎవ‌రూ నన్ను ఇష్టపడలేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నా స్నేహితులు నన్ను వేరే విధంగా చూసారు. నన్ను ఎగతాళి చేశారు... వెబ్ సైట్ల‌లో మార్ఫింగ్ ఫోటోలు చూసి, నేను ఎలాగోలా పేరు తెచ్చుకున్నందుకు నేను ఇక‌ పని చేయనవసరం లేదని ఎగతాళి చేసారు. నాకు అర్థం కాని విచిత్రమైన అవహేళనలు ఎదుర‌య్యాయి. నేను స్కూల్‌ని ఎప్పుడు వదిలేస్తున్నాను అనుకున్నాను. నేను యాహూలో ఎందుకు ఉన్నాను అని అందరూ నన్ను అడుగుతూ ఉండేవారు. చాలా చిన్న వయస్సు నుండి నా గురించి చాలా చాలా ప్రశ్నలు స‌మాధానం లేకుండా అలానే ఉన్నాయి. నా గురించి చాలా మంది తీర్పులు చెప్పారు"" అని త‌న బాధ‌ను వెల్ల‌గ‌క్కింది. సెల‌బ్రిటీని అన్ని క‌ళ్లు చుట్టుముట్టి ఉంటాయి. వాటితో ఇలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుందని జాన్వీ ఎపిసోడ్ ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

2018లో జాన్వి "ధడక్" చిత్రంతో నటనను ప్రారంభించింది. ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్ క‌థానాయ‌కుడు. క‌ర‌ణ్ జోహార్ నిర్మించారు. మిలీ -గుంజన్ సక్సేనాతో సహా అనేక మహిళా ప్రధాన చిత్రాలలో జాన్వీ క‌పూర్ నటించింది. చివరిసారిగా వరుణ్ ధావన్‌తో కలిసి బవాల్‌లో కనిపించింది. తర్వాత రాజ్‌కుమార్ రావుతో కలిసి మిస్టర్ అండ్ మిసెస్ మహిలో కనిపించనుంది. తెలుగు ప‌రిశ్ర‌మ‌కు "దేవ‌ర" చిత్రంతో ప‌రిచ‌య‌మ‌వుతోంది.