Begin typing your search above and press return to search.

నాన్నకి 'దేవర' బ్యూటీ ప్రశంస

తాజాగా హాయ్ నాన్న సినిమా పై బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ స్పందించింది. ఎప్పటిలాగే నాని అద్భుతమైన నటనతో మెప్పించాడు అంటూ కామెంట్స్ చేసింది.

By:  Tupaki Desk   |   10 Jan 2024 9:05 AM GMT
నాన్నకి దేవర బ్యూటీ ప్రశంస
X

2023 చివర్లో వచ్చిన సినిమాల్లో హాయ్ నాన్న ఒకటి. నాని హీరోగా మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్‌ గా రూపొందిన విభిన్న కథా చిత్రం హాయ్‌ నాన్న కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌ వచ్చింది. నాని నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు మృణాల్ అందంతో పాటు అభినయంతో మెప్పించిందని కామెంట్స్ వచ్చాయి.

తాజాగా హాయ్ నాన్న సినిమా పై బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ స్పందించింది. ఎప్పటిలాగే నాని అద్భుతమైన నటనతో మెప్పించాడు అంటూ కామెంట్స్ చేసింది. అంతే కాకుండా మృణాల్‌ చాలా అందంగా కనిపించింది అన్నట్లుగా కూడా ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.

దర్శకుడిగా శౌర్యువ్‌ తొలి ప్రయత్నంలోనే ఇలాంటి మంచి సినిమాను తీయడం నిజంగా అభినందనీయం అంటూ జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ చేయడం తో అందరి దృష్టిని ఆకర్షించింది. జాన్వీ కపూర్ పోస్ట్ కు హాయ్‌ నాన్న టీం సభ్యులు స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిజేశారు.

హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్‌ ఒక్క కమర్షియల్‌ హిట్ ను దక్కించుకోలేదు. ఇప్పుడు ఎన్టీఆర్‌ కి జోడీగా ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ అమ్మడు మొదటి కమర్షియల్‌ హిట్ ను దేవర తో దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియా ద్వారా మరో సినిమా గురించి, ఆ సినిమా లో హీరో హీరోయిన్‌ గురించి ప్రశంసిస్తూ పోస్ట్‌ చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజంగా జాన్వీ కపూర్ చాలా గ్రేట్‌ అంటూ నెటిజన్స్ ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.