Begin typing your search above and press return to search.

26 ఏళ్ల జాన్వీ ర‌హ‌స్యాలు డీకోడెడ్

అయినా ఇంకా జాన్వీ గురించి అంతగా తెలియనివి చాలా ఉన్నాయి. కుర్ర‌బ్యూటీ డ్రీమీ వెడ్డింగ్ నుండి త‌న‌కు ఇష్ట‌మైన వ్యాప‌కాలు.. డేటింగ్ గురించి జాన్వీ కపూర్ గురించి ఎవ‌రికీ తెలియని కొన్ని వాస్తవాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   3 Nov 2023 3:39 PM GMT
26 ఏళ్ల జాన్వీ ర‌హ‌స్యాలు డీకోడెడ్
X

జాన్వీ కపూర్ వయస్సు కేవలం ప‌ది చిత్రాలే కావచ్చు.. కానీ ప్ర‌తిభావంతురాలైన నటి అని ఇప్పటికే ప్రూవ్ అయింది. గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్, ఘోస్ట్ స్టోరీస్, మిలీ, బ‌వాల్, మిస్ట‌ర్ అండ్ మిసెస్ మ‌హి చిత్రాల‌తో తానేంటో నిరూపించింది. కేవ‌లం 26 ఏళ్లకే జాన్వీ అద్భుత‌మైన‌ సూపర్‌స్టార్‌డమ్‌కి చేరుకుంది. ప్రస్తుతం జెన్-జెడ్ హీరోయిన్ గా బాలీవుడ్ ని ఏల్తోంది. ఇంత‌లోనే టాలీవుడ్ లో ఎన్టీఆర్ స‌ర‌స‌న దేవ‌ర చిత్రంతో అడుగుపెడుతోంది. జాన్వీకి అద్భుతమైన లైనప్ ఉంది. సినిమాలు-నటనను పక్కన పెడితే, కపూర్ గాళ్ సహజమైన ఆకర్షణ .. పక్కింటి అమ్మాయి లుక్స్ త‌న‌కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించిపెట్టాయి. కపూర్ గాళ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అభిమానులకు త‌న‌ వ్యక్తిగత జీవితంలోని చాలా సంగ‌తుల‌ను రివీల్ చేస్తోంది. అయినా ఇంకా జాన్వీ గురించి అంతగా తెలియనివి చాలా ఉన్నాయి. కుర్ర‌బ్యూటీ డ్రీమీ వెడ్డింగ్ నుండి త‌న‌కు ఇష్ట‌మైన వ్యాప‌కాలు.. డేటింగ్ గురించి జాన్వీ కపూర్ గురించి ఎవ‌రికీ తెలియని కొన్ని వాస్తవాలు ఉన్నాయి.


జాన్వీ కపూర్ ఆ పేరెలా వ‌చ్చింది?

శ్రీదేవి - అనిల్ కపూర్ నటించిన బోనీ కపూర్ నిర్మించిన 'జుదాయి' చిత్రం జాన్వీ కపూర్ పుట్టకముందే ఫిబ్రవరి 1997లో విడుదలైంది. ఒక మీడియా క‌థనం ప్రకారం, శ్రీదేవి- బోనీ కపూర్ ఈ చిత్రంలో ఊర్మిళ మటోండ్కర్ పాత్ర పేరు జాన్వి. ఆ పేరును ఇద్ద‌రూ ఇష్టపడ్డారు. వారి మొదటి బిడ్డకు అదే పేరు పెట్టారు.

డాక్టర్ కావాలని క‌ల‌లు:

కపూర్ గాళ్ ఒకసారి పాపుల‌ర్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చిత్ర పరిశ్రమలో చేరడానికి తన ఆసక్తిని వ్యక్తం చేసినప్పుడు త‌న మామ్ శ్రీదేవి తన కుమార్తె కెరీర్‌ను వేరొక ర‌కంగా ఊహించుకున్నార‌ని తెలిపారు. నేను చిన్నతనంలో ఉన్న‌ప్పుడు.. డాక్టర్ కావాలని అమ్మ‌ నిజంగా కోరుకుంది'' అని 26 ఏళ్ల జాన్వీ చెప్పింది. నాకేం తెలియదు.. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను..నన్ను క్షమించండి అమ్మ,.. కానీ నాకు డాక్ట‌ర్ కావ‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే మేధ‌స్సు లేదు! అని అంది. శ్రీదేవికి తమ కూతురు బాలీవుడ్‌లో చేరాలనే ఆలోచనను సులభతరం చేసింది ఆమె తండ్రి బోనీ కపూర్ అని కూడా కపూర్ గాళ్ వెల్లడించారు.

భాగస్వామి ల‌క్ష‌ణాలు ఇవే…

తన భవిష్యత్ భాగస్వామిలో జాన్వీ కోరుకునే లక్షణాల జాబితా సుదీర్ఘంగా ఉంది. ఆమె ఒకసారి వోగ్ ఇండియాకు ఈ విష‌యాల‌ను చెప్పింది. ''నాకు కాబోయేవాడు నిజంగా ప్రతిభావంతుడు అయి ఉండాలి. చేసే పనులపై మక్కువ కలిగిన‌వాడై ఉండాలి. నేను ఉత్సాహంగా ఉండాలి.. అతడి నుండి ఏదైనా నేర్చుకోవాలి. హాస్యచ‌తుర‌త‌ కూడా చాలా ముఖ్యం. వాస్తవానికి అతడు నాతోడుగా నిరంత‌రం దృష్టిసారించేవాడు అయి ఉండాలి!

డ్రీమ్ వెడ్డింగ్ ఇలా ఉండాలి:

అదే వోగ్ ఇంటర్వ్యూలో కపూర్ గాళ్ తన భవిష్యత్ వివాహానికి తిరుపతి తన డ్రీమ్ డెస్టినేషన్ అని కూడా అంది. నాకు నిజమైన సన్నిహితమైన దగ్గరగా ఉండే వెన్యూ కావాల‌ని కోరుకుంటున్నాను. నాకు పెద్దగా ఫాన్సీగా ఏమీ అవసరం లేదు! అని జాన్వీ తెలిపింది. నా పెళ్లి నిజంగా సంప్రదాయబద్ధంగా జరుగుతుందని .. తిరుపతిలో జరుగుతుందని నాకు ఇప్పటికే తెలుసు. నేను కంజీవరం జరీ చీరను ధరించబోతున్నాను .. వివాహం తర్వాత నేను ఇష్టపడే అన్ని దక్షిణ భారతీయ వంటకాలతో పూర్తి దావత్ జరగబోతోంది. . ఇడ్లీ, సాంబార్, పెరుగు అన్నం ఖీర్ ఇవే నా పెళ్లి మెనూ.. అని కూడా స‌ర‌దాగా మాట్లాడేసింది.

అబ్బాయితో మొదటి అడుగు వేయలేదు

ఒకానొక ఇంట‌ర్వ్యూలో కరీనా కపూర్ ఖాన్‌తో మాట్లాడుతూ జాన్వీ ఎప్పుడూ ఎవరినీ డేటింగ్ కి పిల‌వ‌లేద‌ని తెలిపింది. కానీ మనలో చాలా మందిలాగే, డేటింగ్‌కు ముందు దశ థ్రిల్‌ను ఆనందిస్తున్నాను అని అంది. నేను చాలా తెలివితక్కువదానిని. నేను న‌చ్చిన‌వాడికి హింట్ ఇస్తాను. కానీ అవతలి వ్యక్తి ఖచ్చితంగా ఆసక్తి కలిగి ఉన్నాడని నాకు తెలిసే వరకు నేను ల‌వ్ ట్రాక్ గురించి చాలా స్పష్టంగా చెప్పను... అని కూడా అంది.