Begin typing your search above and press return to search.

అంబానీ పెళ్లిలో జాన్వీ-ఖుషి నృత్యం

By:  Tupaki Desk   |   4 March 2024 4:34 AM GMT
అంబానీ పెళ్లిలో జాన్వీ-ఖుషి నృత్యం
X

అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ మూడు రోజుల ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. వేడుక‌లో ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖ‌ తారాగ‌ణం గ్లామ‌ర్ ని వెద‌జ‌ల్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. ఇప్పుడు డ్యాన్స్ ఫ్లోర్‌లో జెన్ -Z సంచలనాలు జాన్వీ కపూర్- ఖుషీ క‌పూర్ సిస్ట‌ర్స్ తో పాటు, అనన్య పాండే, సారా అలీ ఖాన్ లాంటి నేటిత‌రం తార‌ల డ్యాన్సులు ఆక‌ట్టుకున్నాయి. ఈ వేదిక‌పై టైమ్‌లెస్ క్లాసిక్ `బోలే చుడియాన్`కి మళ్లీ జీవం పోసారు స్టార్ కిడ్స్.

`బోలే చుడియాన్..`ని పునఃసృష్టించడమే కాకుండా ట్యాలెంటెడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా యువ‌త‌రం నాయిక‌ల‌తో క‌లిసి వేదిక‌పై డ్యాన్సులు చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాషన్ ప్రపంచంలో మాస్ట్రో మనీష్ మల్హోత్రా స్థాయి ఎలాంటిదో తెలిసిందే. అత‌డు ఇప్పుడు యువ‌నాయిక‌ల‌తో డ్యాన్సులు చేయ‌డం ఎగ్జ‌యిట్ చేస్తోంది.

గుజరాత్‌ జామ్‌నగర్‌లోని రెగల్ సెట్టింగ్‌లో అంబానీలు నిర్వహించిన విలాసవంతమైన వేడుకలు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. ప్రతి తరం నుండి ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. శనివారం రాత్రి స్టార్ సెల‌బ్రిటీల‌తో వేదిక జామ్ అయింది. తెల్లవారుజాము వరకు అతిథులు విచ్చేస్తూనే ఉన్నారు.

ఈ వేడుక‌లో ఖాన్ లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. బాలీవుడ్‌లోని ముగ్గురు ఖాన్‌లు - షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మరియు అమీర్ ఖాన్ - కలిసి ఆస్కార్ విన్నింగ్ ట్రాక్ `నాటు నాటు` బీట్‌లకు డ్యాన్స్ చేస్తూ వేదికపైకి రావడంతో ఉత్సవాలు కీల‌క మలుపు తిరిగాయి. ఖాన్ ల‌తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ నాటు నాటుకు స్టెప్పులు వేస్తూ క‌నిపించ‌డం మ‌రో ప్ర‌ధాన హైలైట్. లెజెండరీ తార‌లు డ్యాన్స్ ఫ్లోర్‌పై చేసిన సంద‌డి ఈ వేడుక‌ల్ని ఐకానిక్ ఈవెంట్ గా మార్చాయి.

https://twitter.com/ObsessedMovies/status/1764033257920778282?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1764033257920778282|twgr^145c976782b2b1633c5bb622ee8f67fcde7360ca|twcon^s1_&ref_url=https://d-8101924602976530872.ampproject.net/2402141842000/frame.html