Begin typing your search above and press return to search.

జాన్వీ.. ఇప్పుడే అసలు గేమ్ మొదలైంది..

సెకండ్ మూవీగా ఫీమేల్ ఒరియాంటెడ్ కథతో రియల్ లైఫ్ ఎయిర్ ఫైటర్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో జాన్వీ కపూర్ నటించింది

By:  Tupaki Desk   |   21 March 2024 4:19 AM GMT
జాన్వీ.. ఇప్పుడే అసలు గేమ్ మొదలైంది..
X

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ జాన్వీ కపూర్. మొదట్లోనే ఆమెకు బ్యాక్ గ్రౌండ్ ద్వారా మంచి అవకాశాలు వచ్చాయి. తండ్రి బోణి కపూర్ కూడా బాలీవుడ్ బడా నిర్మాత కావడంతో జాన్వీ కపూర్ కి కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ లో మొదటి అవకాశం వచ్చింది. సైరత్ రీమేక్ ధఢక్ తో ఆమె హీరోయిన్ గా అడుగుపెట్టి సూపర్ హిట్ అందుకుంది.

సెకండ్ మూవీగా ఫీమేల్ ఒరియాంటెడ్ కథతో రియల్ లైఫ్ ఎయిర్ ఫైటర్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో జాన్వీ కపూర్ నటించింది. ఆ మూవీ పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. తరువాత ఈ బ్యూటీ చేసిన సినిమాలు ఏవీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అవన్నీ కూడా బోనీ కపూర్ నిర్మించినవే కావడం విశేషం. కూతురు కెరీర్ కోసం బోణి కపూర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

అయితే కూతురుని బూలీవుడ్ లో నిలబెట్టడానికి బోనీ కపూర్ చేసిన ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ సినిమాలు ఆమెకి ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు. అయితే తెలుగులో ఊహించని విధంగా దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కి జోడీగా నటించే అవకాశం ఈ అమ్మడు సొంతం చేసుకుంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. దసరాకి ప్రేక్షకుల ముందుకి రానుంది. మూవీపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇప్పుడు రామ్ చరణ్ కి జోడీగా RC16లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఖరారు అయ్యింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ సిద్ధం అవుతోంది. తాజాగా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తోనే ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసిన జాన్వీ కపూర్ కి ఆశించిన గుర్తింపు రాలేదు.

టాలీవుడ్ లో ఆమె అసలైన కెరియర్ ఇప్పుడే మొదలైందని చెప్పాలి. ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ తో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసే అవకాశం అందుకుంది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే జాన్వీ కపూర్ డైరెక్ట్ గా పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోతుంది. ఆమె ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంది. ఒక విధంగా ఆమె అసలు కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు. మరి అమ్మడికి మన RRR హీరోలు ఎలాంటి సక్సెస్ లను అందిస్తారో చూడాలి. అలాగే జాన్వీ బాలీవుడ్ లో కూడా ఒక రెండు సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.