Begin typing your search above and press return to search.

బీ-అలెర్ట్...చిరుతలా దూసుకొస్తుంది!

బీ -అలెర్ట్ చిరుత‌లా దూసుకొస్తున్న చిచ్చ‌ర పిడుగుతో త‌స్మాత్ జాగ్ర‌త్త‌! అవును అతిలోక సుంద‌రి త‌న‌య జాన్వీక‌పూర్ ని చూస్తుంటే మిగ‌తా భామ‌లంతా అలెర్ట్ కావాల్సిందే అన్నంతగా స‌న్నివేశం క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   8 March 2024 2:45 AM GMT
బీ-అలెర్ట్...చిరుతలా దూసుకొస్తుంది!
X

బీ -అలెర్ట్ చిరుత‌లా దూసుకొస్తున్న చిచ్చ‌ర పిడుగుతో త‌స్మాత్ జాగ్ర‌త్త‌! అవును అతిలోక సుంద‌రి త‌న‌య జాన్వీక‌పూర్ ని చూస్తుంటే మిగ‌తా భామ‌లంతా అలెర్ట్ కావాల్సిందే అన్నంతగా స‌న్నివేశం క‌నిపిస్తుంది. అమ్మ‌డు స‌రైన టైమ్ చూసుకుని టాలీవుడ్ లో 'దేవ‌ర‌'తో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియాలో టాలీవుడ్ దూసుకుపోతున్న స‌మ‌యంలో జాన్వీ ఎంట్రీ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీస్తోంది. తొలి సినిమా రిలీజ్ కాక ముందే రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఛాన్స్ అందుకుంది.

బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఆర్ సీ -16 లోనూ అవ‌కాశం అందుకుని మిగ‌తా భామ‌ల గుండెల్లో రెళ్లు ప‌రిగెట్టించేలా చేస్తుంది. అటు తార‌క్..ఇటు చ‌ర‌ణ్ ఇద్ద‌రి స‌ర‌స‌న ఒకేసారి ఛాన్స్ అందుకోవ‌డం అంటే ఆషామాషీనా? అందులోనూ అంద‌మైన భామ‌ల నుంచి తీవ్ర‌మైన పోటీ వాతావ‌ర‌ణంలో ఇద్ద‌రు సూపర్ స్టార్ల స‌ర‌స‌న ఛాన్స్ అంటే? త‌న‌కి మాత్రం న‌ల్లేరు మీద న‌డ‌క‌లాంటిందే అనిపించింది.

అలాగని జాన్వీ క‌పూర్ బాలీవుడ్ లో వీర‌ప్ర‌తాపం చూపించిందా? అంటే అదేం లేదు. న‌టిగా అక్క‌డా ఇప్పుడిప్పుడే నిల‌దొక్కుకుంటుంది. బిజీ అవుతోన్న త‌రుణంలో టాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. మ‌రి ఈ అవ‌కాశాలు ఎలా సాధ్య‌మైంటే? మామ్ వేసిన పునాదితోనే ఇదంతా సాధ్య‌మ‌వుతుంది. శ్రీదేవికి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ కార‌ణంగానే ఇలా వ‌రుస‌గా ఛాన్సులు ఒడిసిప‌ట్టుకుంటుంది. వెనుక బోనీ క‌పూర్ కూడా చ‌క్రం తిప్ప‌డంతో కాపింటీష‌న్ నుంచి కొంత మంది భామ‌లు ఎగ్జిట్ అవుతున్నారు.

దీంతో జాన్వీకి గేట్లు తెరుచుకుంటున్నాయి. జాన్వీ క‌మిట్ అయిన ఈ రెండు సినిమాలు గ‌నుక స‌క్సెస్ అయితే ఆమె వేగాన్ని ఆప‌డం అసాధ్య‌మ‌నే చెప్పాలి. హీరోలంద‌ర్నీ అమ్మ‌డు రౌండ‌ప్ చేసేస్తుంది. కొత్త వాళ్ల‌కు ఛాన్స్ ఇవ్వ‌కుండా అన్నింటా నేనే అంటోంది. శ్రీలీల‌..ర‌ష్మిక మంద‌న్న లాంటి ఫామ్లో ఉన్న ఫాలోయింగ్ భామ‌ల్ని సైతం జాన్వీ సైడేస్తుంద‌ని అప్పుడే గెస్సింగ్స్ తెర‌పైకి వ‌స్తున్నాయి. ఏది ఏమైనా అంతిమంగా నిల‌బెట్టేది స‌క్సెస్ ఒక్క‌టే అన్న‌ది అంతా గుర్తుంచుకోవాల్సి విష‌యం.