Begin typing your search above and press return to search.

ఆమె ప్రేమ‌కు నాలో పేలుడు సంభ‌వించింది: జాన్వీ

ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ పాప్ గాయ‌నిగా రాజ్య‌మేల్తోంది రిహాన్న‌. అలాంటి పాపుల‌ర్ పాప్ స్టార్‌తో స్నేహానుబంధం ఏర్ప‌డాలంటే

By:  Tupaki Desk   |   19 March 2024 7:46 AM GMT
ఆమె ప్రేమ‌కు నాలో పేలుడు సంభ‌వించింది: జాన్వీ
X

ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ పాప్ గాయ‌నిగా రాజ్య‌మేల్తోంది రిహాన్న‌. అలాంటి పాపుల‌ర్ పాప్ స్టార్‌తో స్నేహానుబంధం ఏర్ప‌డాలంటే.. అంత వీజీనా? కానీ జాన్వీ దీనిని సునాయాసంగానే సంపాదించింది. వివ‌రాల్లోకి వెళితే..

ఇటీవ‌ల ఆసియా నం.1 ధ‌న‌వంతుడు ముఖేష్ అంబానీ వార‌సుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ వేడుక‌లు గుజ‌రాత్- జామ్ న‌గ‌ర్‌లో జామ్ జామ్ అంటూ ఆకర్షణీయంగా జరిగాయి. ఈ వేదిక‌కు ప‌లు పరిశ్రమలకు చెందిన ప్రముఖులు అతిథులుగా విచ్చేశారు. అయితే మూడు రోజుల ఉత్సవంలో అందరి దృష్టి ప్ర‌పంచ‌ పాప్ దిగ్గ‌జం, గాయని రిహన్నాపైనే నిలిచింది.

రిహాన్న అహూతుల‌ను త‌న గానాలాప‌న డ్యాన్సింగ్ ఎబిలిటీతో ఉర్రూత‌లూగించింది. ముంబై సెల‌బ్రిటీలంతా రిహాన్న‌తో క‌లిసి డ్యాన్సులు చేసారు. వేదిక‌పై అంబానీలు, న‌వ‌దంప‌తులు కూడా రిహాన్న‌తో స్టెప్పు క‌లిపారు. పార్టీలో రిహాన్న‌తో సమయాన్ని ఆస్వాధించిందని వీడియోలు వెబ్ లో వైర‌ల్ అయ్యాయి. రిహానా 8 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ప్రదర్శన ఇవ్వడం.. మొత్తం 19 పాటలతో అతిథులను అలరించడం ప్రత్యేక‌మైన మూవ్ మెంట్ గా అభివ‌ర్ణించింది బాలీవుడ్ మీడియా.

అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్‌తో క‌లిసి రిహాన్న‌ ఆకస్మిక నృత్య ప్రదర్శన అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ధడక్ చిత్రం నుండి జింగాత్ బీట్ కు ఇద్దరూ క‌లిసి స్టెప్పులేసిన వీడియో అంత‌ర్జాలంలో దుమారం రేపింది. జాన్వీ త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేయ‌గా వైర‌ల్ గా దూసుకెళ్లింది. ఆ ఇద్ద‌రూ ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకుంటూ స‌ర‌దాగా గ‌డిపిన క్లిప్ కూడా వైర‌ల్ అయింది. వారి చాటింగ్ గురించి అభిమానులు ఆసక్తిని క‌న‌బ‌రిచారు. ఇటీవల, స్క్రీన్ & స్టైల్ ఐకాన్స్ అవార్డ్స్ 2024లో జాన్వి ఇదే విష‌య‌మై ముచ్చ‌టించింది. రిహన్న తో చాలా ఎక్కువసేపు ముచ్చ‌టించే అవ‌కాశం త‌న‌కు క‌లిగింద‌ని జాన్వీ తెలిపింది.

అవార్డ్స్ నైట్ కోసం జాన్వీ కపూర్ గోల్డెన్ గౌనులో చాలా అందంగా కనిపించింది. తన అవార్డును స్వీకరించడానికి వేదికపైకి పిలిచినప్పుడు జాన్వి అప్ర‌య‌త్నంగా అంబానీల ప్రీపెళ్లిలో రిహన్నతో తన సంభాషణలను గుర్తుచేసుకుంది. మునుపటి ఈవెంట్‌లో జాన్వీ కపూర్ రిహన్నాపై ప్రశంసలు కురిపించింది. పాప్ గాయ‌నిని దేవత అని పొగిడేసింది. అదే సమయంలో రిహానా మంచిత‌నం, వెంట‌నే చేరువయ్యే వ్యక్తిత్వాన్ని కూడా హైలైట్ చేసింది. నిజానికి రిహన్నాకి ఎవరు అభిమాని కాదు? కాబట్టి ఇది నాకు క‌చ్చితంగా అరుదైన‌ క్షణం. ఆమె నిజ‌మైన‌ దేవత.. కానీ అన్నింటికంటే ఆమె చాలా వామ్‌గా ప్రేమ‌గా ఉంటుంది. రిహానా చాలా సాధారణమైనది.. చాలా కూల్ ప‌ర్స‌నాలిటీ.. నాలో పేలుడు సంభవించింది! అని జాన్వీ త‌న అభిమానాన్ని చాటుకుంది.

జాన్వీతో కలిసి డ్యాన్స్ చేయ‌డ‌మే కాదు.. షారుఖ్ ఖాన్ జవాన్‌లోని చలేయా పాటకు కూడా రిహాన్న‌ డ్యాన్స్ చేసింది. ఇంటర్నెట్ సంచలనం ఓరీతో కూడా రిహాన్న ఫోజులిచ్చింది. ఈవెంట్ ప్ర‌ధాన హోస్ట్‌లు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌లతో కలిసి గ్లోబల్ సూపర్ స్టార్ రిహాన్న‌ పోజులివ్వడంతో వేడుకలు కొత్త ఎత్తులకు చేర్చాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. జాన్వీ కపూర్ తదుపరి జూనియర్ ఎన్టీఆర్ `దేవర`లో కనిపిస్తుంది. ఆ తర్వాత రాజ్‌కుమార్ రావుతో పాటు మిస్టర్ అండ్ మిసెస్ మహిలో క‌నిపిస్తుంది. ఉలాజ్ అనే చిత్రంలోను న‌టిస్తోంది. రామ్ చరణ్‌తో బుచ్చిబాబు చిత్రంలో క‌థానాయిక‌గా ఎంపికైంది. జూనియ‌ర్ స‌ల్మాన్ వరుణ్ ధావన్‌తో మ‌రో చిత్రానికి క‌మిటైంది.