Begin typing your search above and press return to search.

చరణ్ మూవీ.. మళ్లీ డౌట్ పెట్టిన జాన్వీ

ఆ వార్తలు నిజమే అన్నట్లు బోనీ కపూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు

By:  Tupaki Desk   |   24 Feb 2024 7:49 AM GMT
చరణ్ మూవీ.. మళ్లీ డౌట్ పెట్టిన జాన్వీ
X

సౌత్ తో పాటు బాలీవుడ్ లో సినిమాలను చేయడం అప్పట్లోనే పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్రీదేవి. ఆమె వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. టాలీవుడ్‌ లో ఎన్టీఆర్ తో కలిసి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇవ్వబోతుంది.

దేవర సినిమా తో జాన్వీ కపూర్ మొదటి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు ఎన్టీఆర్‌ సినిమాను చేస్తూనే మరో వైపు రామ్‌ చరణ్ సినిమాకు జాన్వీ కపూర్ ఓకే చెప్పిందనే వార్తలు గత కొన్నాళ్లుగా వస్తున్నాయి.

ఆ వార్తలు నిజమే అన్నట్లు బోనీ కపూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చరణ్ తో సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే జాన్వీ కపూర్‌ మాత్రం ఇంకా తాను తెలుగు లో దేవర సినిమా మినహా మరే సినిమాను చేయడం లేదని చెప్పుకొచ్చింది.

తన ఫ్యామిలీ మెంబర్స్ చరణ్ తో సినిమా చేస్తున్నట్లు చెప్పడం స్టేట్మెంట్ ఇవ్వడం గురించి నాకు తెలియదు. నేను ఏ సినిమాల్లో నటిస్తున్నాను అనేది చెప్పలేను. దేవర సినిమాలో తప్ప మరే సినిమాను కూడా నేను చేయడం లేదన్నట్లుగా జాన్వీ కపూర్ పేర్కొంది.