Begin typing your search above and press return to search.

జాన్వీ కపూర్‌ పేరు పెళ్లికి ముందే ఫిక్స్‌...!

అతిలోక సుందరి దివంగత శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ ఇన్నాళ్లు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ వచ్చింది

By:  Tupaki Desk   |   6 March 2024 8:30 AM GMT
జాన్వీ కపూర్‌ పేరు పెళ్లికి ముందే ఫిక్స్‌...!
X

అతిలోక సుందరి దివంగత శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ ఇన్నాళ్లు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. సౌత్‌ లో ఈమె సినిమా ఎప్పుడెప్పుడు ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఎన్టీఆర్ తో కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను జాన్వీ కపూర్‌ చేసేందుకు కమిట్ అయ్యి టాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు సిద్ధం అయ్యింది.

జాన్వీ కపూర్ టాలీవుడ్‌ మొదటి సినిమా దేవర ఇంకా విడుదల అవ్వకుండానే తెలుగు లో మరో సినిమాకు ఓకే చెప్పింది. రామ్‌ చరణ్‌, బుచ్చి బాబు కాంబోలో రూపొందబోతున్న స్పోర్ట్స్‌ డ్రామాలో జాన్వీ హీరోయిన్‌ అంటూ అధికారిక ప్రకటన వచ్చింది. నేడు జాన్వీ కపూర్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

జాన్వీ కపూర్‌ పేరు వెనుక ఆసక్తికర కథ ఉంది. శ్రీదేవి, అనిల్‌ కపూర్‌ జోడీగా 1997 లో జుదాయి అనే సినిమా వచ్చింది. ఆ సినిమాను బోనీ కపూర్‌ నిర్మించాడు. ఆ సినిమా నిర్మాణం సమయంలోనే శ్రీదేవి, బోనీ కపూర్‌ల మధ్య స్నేహం, ప్రేమకు దారి తీసింది.

జుదాయి సినిమాలో ఊర్మిళ మతోంద్కర్‌ కీలక పాత్రలో కనిపించింది. ఆ పాత్ర పేరు జాన్వీ. సినిమాలోని ఆ పాత్ర అంటే బోనీ మరియు శ్రీదేవికి ఇష్టమట. అందుకే పెళ్లికి ముందే కూతురు పుడితే జాన్వీ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారట. అందుకే తమ మొదటి కూతురుకు జాన్వీ కపూర్‌ అని పేరు పెట్టారు.

జాన్వీ కపూర్‌ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడుతూ.. తిరుపతిలోనే తన పెళ్లి ఉంటుందని అంది. పెళ్లి విందులో సౌత్‌ ఇండియన్‌ వంటలు ఖచ్చితంగా ఉంటాయని జాన్వీ పేర్కొంది. టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్‌ రెండు పెద్ద సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్‌ హిందీలో కూడా రెండు సినిమాలకు కమిట్‌ అయ్యింది.

రాబోయే రోజుల్లో జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా వరుస సినిమాలు చేయబోతుంది. పాన్‌ ఇండియా రేంజ్ హీరోయిన్‌ గా జాన్వీ కపూర్‌ భారీ డిమాండ్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. దేవర మరియు చరణ్ మూవీ హిట్‌ అయితే జాన్వీ స్థాయి పది రెట్లు పెరిగే అవకాశం ఉంది.