Begin typing your search above and press return to search.

జాన్వీ వెన్నుపూస‌పై హీరో స‌రిగ‌మ‌ప‌!

అందులో రాజ్ కుమార్ రావ్ ...జాన్వీ వెన్నుపూస‌పై స‌రిగ‌మ‌పా అంటూ త‌డిమేస్తున్నాడు. ఓ సినిమా ప్ర‌చారంలో భాగంగా ఈ స‌న్నివేశం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   9 May 2024 12:32 PM GMT
జాన్వీ వెన్నుపూస‌పై హీరో స‌రిగ‌మ‌ప‌!
X

అతిలోక సుంద‌రి ముద్దుల త‌న‌య జాన్వీక‌పూర్ అందం గురించి వ‌ర్ణించ‌డ‌మేలా. అందంలో అమ్మ‌నే పోలిదంటూ ఎప్పుడో స‌ర్టిఫికెట్ ఇచ్చేసారు. కొత్త‌గా జాన్వీ బ్యూటీ గురించి పొగ‌డాల్సిన ప‌నిలేదు. ఆ బ్యూటీ కోసం టాలీవుడ్ స్టార్ హీరోలే వెయిట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి రామ్ చ‌ర‌ణ్‌...ఎన్టీఆర్ లు ఆమెతో క‌లిసి ప‌ని చేస్తున్నారు. ఆన్ స్క్రీన్ లో ఆమె సెట్స్ ఎక్స్ పీరియ‌న్స్ ఎలా ఉంటుంద‌న్న‌ది త‌ర్వాత తెలుస్తుంది.

అయితే తాజాగా జాన్వీ క‌పూర్-రాజ్ కుమార్ రావ్ క‌లిసి ఉన్న ఓ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. అందులో రాజ్ కుమార్ రావ్ ...జాన్వీ వెన్నుపూస‌పై స‌రిగ‌మ‌పా అంటూ త‌డిమేస్తున్నాడు. ఓ సినిమా ప్ర‌చారంలో భాగంగా ఈ స‌న్నివేశం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే ఇద్ద‌రు జంట‌గా న‌టించిన `మిస్ట‌ర్ అండ్ మిస్ట‌ర్స్ మ‌హి` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఈ సంద్భంగా క‌లిసి సినిమా ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. జాన్వీ కపూర్ ఎరుపు రంగు రెడ్ ప్రాక్ లో ఎంతో అందంగా ఉంది. అమ్మ‌డు ముస్తాబైన విధానం..మ్యాక‌ప్ ప్ర‌తీది జాన్వీని ఎంతో అందంగా ఫోక‌స్ చేస్తున్నాయి. అయితే ఫోటో సెష‌న్ లో భాగంగా జాన్వీ..రాజ్ కుమార్ జంట‌గా ఫోటోలిచ్చారు. ఆ స‌మ‌యంలో రాజ్ కుమార్ జాన్వీ వీపు వైపు చేయి వేసాడు. అప్ప‌టికే ఆమె డ్రెస్ కి ఉన్న బ‌ట‌న్ల‌ను చేతితో ప‌రిశీలిస్తున్నాడు. ఫోటో సెష‌న్ అనంత‌రం కెమెరా బీహైండ్ ఆ చేతికి త‌గిలింది ఏంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసాడు.

ప‌క్క‌నే ఉన్న జాన్వీని దగ్గ‌ర‌కు తీసుకుని బొంగ‌రంలా తిప్పి ఆమె వీపు వైపు నుంచి మెడ వ‌ర‌కూ ఉన్న డ్రెస్ బెల్ట్ పై చేతి వేళ్ల‌తో నొక్కి చూసాడు. దీంతో జాన్వీ ఒక్క‌సారిగా సిగ్గుప‌డిపోయింది. రాజ్ కుమార్ రావ్ ని వైపు ఓ లుక్ వేసి న‌వ్వుతూ చేతులు ప‌క్కకు తొసేసింది. ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది.