Begin typing your search above and press return to search.

కుర్ర హీరోయిన్ ఇంట్లో విలాస‌వంత‌మైన బార్

జాన్వీ త‌న క‌లల ఇంటికి అద్భుత‌మైన ఇంటీరియ‌ర్ కోసం కొన్ని కోట్లు ఖ‌ర్చు చేసింది. ఈ ఇంటి అందాన్ని చూపించ‌డానికి జాన్వీ, త‌న‌ తండ్రి బోనీ కపూర్ జ‌త‌గా ఓ చోట చేరారు.

By:  Tupaki Desk   |   11 Dec 2023 5:16 PM GMT
కుర్ర హీరోయిన్ ఇంట్లో విలాస‌వంత‌మైన బార్
X

జాన్వీ కపూర్... బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో భారీగా పారితోషికాల్ని ఆర్జిస్తున్న ఈ న‌వ‌త‌రం బ్యూటీ త‌న సంపాద‌న‌ను రియ‌ల్ వెంచ‌ర్ల‌లో పెట్టుబ‌డులుగా పెడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే జాన్వీకి ఎన్ని అపార్ట్ మెంట్లు ఉన్నా కానీ, ముంబైలోని తన స్వ‌గృహాన్ని ఎంతో ఆహ్లాక‌రంగా తీర్చిదిద్ది అంద‌రికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.


జాన్వీ త‌న క‌లల ఇంటికి అద్భుత‌మైన ఇంటీరియ‌ర్ కోసం కొన్ని కోట్లు ఖ‌ర్చు చేసింది. ఈ ఇంటి అందాన్ని చూపించ‌డానికి జాన్వీ, త‌న‌ తండ్రి బోనీ కపూర్ జ‌త‌గా ఓ చోట చేరారు. జాన్వీ దివంగత తల్లి శ్రీదేవి అభిరుచిని ఇంట్లో ప్రతి మూలలో ఎంత‌ లోతుగా ప్రభావితం చేసిందో వారు వెల్లడించారు.


నిజానికి ఇల్లు అంటే మీరు కొనే నాలుగు గోడలే కాదు. ఇది ఎంపికలు. ఇది మీరు తీసుకువచ్చే ప్రేమ, ఇది అనుభూతి, ఇది మీ ఇంట్లో మీరు సృష్టించే జ్ఞాపకాలు అని జాన్వీ చెప్పింది. ఇంట్లో జాన్వీకి ఇష్టమైన కార్నర్ .. ఆమె ఉదయం లేవ‌గానే తొలిగా గడిపే అంద‌మైన‌ ప్రదేశాన్ని ఎంతో ప్లెజెంట్ గా రూపొందించుకుంది.


ఈ రూమ్ చాలా ఓపెన్‌గా ఉంది. బయట చెట్ల‌తో ప‌చ్చ‌ద‌నం ఆవ‌రించింది. పెద్ద కిటికీలు, మొత్తం గోడ గుండా విస్తరించి ఉన్నాయి. అలాగే ప్రాథమికంగా ఆర్ట్‌వర్క్ .. పెయింటింగ్‌ల ద్వారా మరింత వెచ్చదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నించాము అని జాన్వీ చెప్పింది.


రెండవ అంతస్తులోని కారిడార్ త‌మ‌ కుటుంబ చరిత్రను ఎలివేట్ చేసే అంద‌మైన‌ ఫోటో ఫ్రేమ్‌లతో అలంక‌రించారు. భోజన ప్రాంతంతో పాటు గదిలో ఒక బార్ ఉంది. ఈ బార్ ఎంతో విలాస‌వంతంగా క‌నిపిస్తోంది. సినిమా లెజెండ్ శ్రీ‌దేవి బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్ హైలైట్. శ్రీ‌దేవి వేసిన మొదటి పెద్ద పెయింటింగ్ ని అలంక‌రించారు.


శ్రీదేవి బతికున్నప్పుడు వారి మునుపటి నివాసం మాదిరిగానే అక్కడ ఒక గది డిజైన్ చేసారు. ఆ ఇల్లు ఎలా ఉండేదో దానికి ఖచ్చితమైన 1:1 ప్రతిరూపం అది. ఈ కుషన్లు, ఈ సోఫాలు మన పాత ఇంటి వెచ్చదనాన్ని ఈ ప్రదేశంలోకి తీసుకువెళతాయి. ఇది అనేక విభిన్న ప్రపంచాలను ఒకదానితో ఒకటి కలపడం అని జాన్వీ చెప్పింది. ఈ ఇంట్లో పార్టీ కోసం ఒక ప్ర‌త్యేక‌మైన వ‌స‌తి కూడా ఉంది. ప్ర‌స్తుతం ఎంతో ఆహ్లాద‌క‌ర‌మైన అభిరుచితో రూపొందించిన జాన్వీ ఇంటి ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.


జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ మూవీ `దేవర` షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ సినిమా సహా పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అలాగే సెట్స్ లో ఉన్న సినిమాల్ని పూర్తి చేయ‌నుంది. అటు హిందీ చిత్ర‌సీమ‌లోను జాన్వీ వ‌ర‌స చిత్రాల‌కు సంత‌కాలు చేసింది.