Begin typing your search above and press return to search.

గ్యాంగ్ లైన‌ప్ అదిరింద‌మ్మా జాన్వీ!

జాన్వీక‌పూర్ కి స‌మ‌యం చిక్కితే చాలా స్నేహితుల‌తో చిలౌట్ అవుతుంది. కుదిరితో స్నేహితులుగా..లేదా సోలోగా వెకేష‌న్ కి చెక్కేస్తుంది.

By:  Tupaki Desk   |   16 April 2024 6:02 AM GMT
గ్యాంగ్ లైన‌ప్ అదిరింద‌మ్మా జాన్వీ!
X

జాన్వీక‌పూర్ కి స‌మ‌యం చిక్కితే చాలా స్నేహితుల‌తో చిలౌట్ అవుతుంది. కుదిరితో స్నేహితులుగా..లేదా సోలోగా వెకేష‌న్ కి చెక్కేస్తుంది. ఇక వీకెండ్ వ‌చ్చిందంటే? ప‌బులో పార్టీలంటూ ఏ రేంజ్ లో ఆస్వాదిస్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోయిన్ గా బిజీ అయిన నాటి నుంచి ప‌బ్ ల‌కు కాస్త దూరంగా ఉంటుంది గానీ...ఫాం లో లేనంత కాలం ప‌బ్ క‌ల్చ‌ర్ లోనే క‌నిపించేది జాన్వీఅండ్ సిస్ట‌ర్ ఖుషీ క‌పూర్. హీరోయిన్ హోదా వ‌చ్చింది కాబ‌ట్టి ప‌బ్ క‌ల్చ‌ర్ విష‌యంలో కొన్ని ర‌కాల జాగ్ర‌త్త‌ల‌తో ముందుకెళ్తుంది. కుదిరితే నేరుగా ఇంటికే స్నేహితుల్ని పిలిపించి శ‌ని..ఆదివారాలు చిల్ అవుతున్నారు.


తాజాగా జాన్వీ ప్రెండ్స్ గ్యాంగ్ తో అకేష‌న్ కి హాజ‌రైన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అందులో అమ్మ‌డు ప్రెండ్స్ తో ఎలా ఆస్వాదిస్తుందో చూడొచ్చు. ముఖ్యంగా స్నేహితులంతా క‌లిసి ఒకే రంగు డిజైన దుస్తుల్లో త‌ళుక్కుమ‌న్నారు. పింక్ కో-ఆర్డ్ సెట్‌లో షో-స్టాపింగ్ లుక్‌తో ఆ గ్యాంగ్ అద‌రగొట్టేస్తుంది. పింక్ వెల్వెట్ టాప్‌తో మ్యాచింగ్ ప్యాంట్‌.. బ్లష్ నుండి వైబ్రెంట్ రోజ్‌కి మారిన జాన్వీ సొగ‌బును గ‌మ‌నించొచ్చు. ఇందులో జాన్వీ లైట్ మ్యాక‌ప్ తోనే క‌నిపిస్తుంది.


పింక్ వ‌ర్ణం షైనింగ్ తోనే మ్యాక‌ప్ అవ‌స‌రం లేద‌నిపిస్తుంది. గ్యాంగ్ అంతా ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులిచ్చారు. వేడుక‌లో గ్యాంగ్ అంతా అంతాక్ష‌రి ఆడేసారు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. జాన్వీ బ్యూటీపై నెటి జ‌నుల కామెంట్లు ఇంట్రెస్టింగ్. ఇక జాన్వీ సినిమాల స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు..హిందీ భాష‌ల్లో దూసుకుపోతుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా వెలిగిపోతుంది.


`దేవ‌ర` సెట్స్ లో ఉండ‌గానే ఆర్సీ 16 లో ఛాన్స్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఇంకా అమ్మ‌డి కోసంచాలా అవ‌కాశాలు క్యూలో ఉన్నాయి. రిలీజ్ కి ముందే ఈ రేంజ్ లో బ‌జ్ క్రియేట్ చేస్తుందంటే? అవి రిలీజ్ అయి స‌క్సెస్ అయితే అమ్మ‌డి క్రేజ్ మూములుగా ఉండ‌దు. అలాగే బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు చేస్తుంది.