Begin typing your search above and press return to search.

'దేవర' తంగం.. ఓ అందమైన మాయ!

ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు అయితే శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి

By:  Tupaki Desk   |   6 March 2024 7:26 AM GMT
దేవర తంగం.. ఓ అందమైన మాయ!
X

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ దేవర సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు అయితే శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి.

మధ్యలో కొన్ని ఊహించని కారణాల వలన బ్రేకులు పడుతున్నప్పటికీ కొరటాలు మాత్రం వీలైనంతవరకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ తోనే వర్క్ ఫినిష్ చేస్తున్నాడు. అసలైతే ఈ సినిమాను ఏప్రిల్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడడం అలాగే కొన్ని షూటింగ్ పనులు అనుకున్న సమయానికి పూర్తిగా కాకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది.

మొత్తానికి దసరాకు సినిమాను గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా తంగం అనే పాత్రలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆమె ఫస్ట్ లుక్ కూడా ఇదివరకే విడుదలైంది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి తరహాలో తన నేచురల్ అందంతో మెస్మరైజ్ చేస్తున్న జాన్వి దేవరలో మాత్రం చాలా కీలకమైన పాత్రలోనే కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఒక బ్యూటిఫుల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్లో ఆమె అందంతో మాయ చేస్తున్న విధానం కుర్రాళ్ళ మనసును దోచేస్తోంది. గతంలో ఎన్నో గ్లామరస్ పాత్రలు చేసిన ఈ బ్యూటీ ఈసారి మాత్రం అచ్చమైన పల్లెటూరి తెలుగమ్మాయిలా ఆకట్టుకుంటుంది. జాన్వి ఈ తంగం పాత్రతో ఎన్ని అవార్డులు సొంతం చేసుకుంటుందో కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని ప్రశంసలు కురిపిస్తారు అని చెప్పవచ్చు.

అందమైన కురులతో చక్కనైన బొట్టుతో అమ్మడు చీరలో కనిపించిన విధానం చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఇక ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ 16వ సినిమాలో కూడా హీరోయిన్ గా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో కూడా మరో రెండు ప్రాజెక్టులు చేస్తోంది. ఈ ఏడాదితో పాటు మరో ఏడాది కూడా అమ్మడు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ లు అందుకునే అవకాశం కనిపిస్తోంది.