Begin typing your search above and press return to search.

సినిమా వాళ్లతో అది చేయనంటున్న జాన్వీ..!

లేటెస్ట్ గా అమ్మడు తన సోదరి ఖుషి కపూర్ తో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నది.

By:  Tupaki Desk   |   8 Jan 2024 5:30 PM GMT
సినిమా వాళ్లతో అది చేయనంటున్న జాన్వీ..!
X

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని కూడా టార్గెట్ చేసింది. తల్లి శ్రీదేవి లానే సౌత్ లో కూడా స్టార్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్న అమ్మడు దేవర సినిమాతో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కి జతగా ఛాన్స్ అందుకుంది. తెలుగులో ఎంట్రీ ఇవ్వడమే భారీ సినిమాతో వస్తున్న జాన్వీ కపూర్ తెలుగుతో పాటుగా అటు తమిళ్ పరిశ్రమలో కూడా పాగా వేయాలని చూస్తుంది.

తను చేసే సినిమాలతోనే కాదు బయట ఈవెంట్స్ లో కూడా జాన్వీ కపూర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు తన సోదరి ఖుషి కపూర్ తో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నది. ఈ షోలో తను డేటింగ్ విషయాల మీద షాకింగ్ కామెంట్స్ చేసింది జాన్వీ కపూర్. తను డేటింగ్ చేసినా సరే సినిమా వాళ్లతో అసలు చేయనని అంటుంది అమ్మడు. సినిమా వాళ్లు ఎప్పుడు బిజీగా ఉంటారని ఆరు ఎవరికీ ఎక్కువ టైం కేటాయించరని.. అందుకే వారితో డేటింగ్ చేయడం తనకు ఇష్టం లేదని అంటుంది జాన్వి కపూర్.

మీరు ఎవరితో డేటింగ్ చేస్తారని కరణ్ జోహార్ అడిగితే.. సినిమా వాళ్లతో మాత్రం అస్సలు డేటింగ్ చేయనని చెప్పేసింది జాన్వీ. తనే ప్రపంచం అనుకున్న వారితో నేను డేటింగ్ చేయాలని అనుకుంటున్నా ప్రతి క్షణాన్ని నాతో ఎంజాయ్ చేయాలి.

సినిమా వాళ్లు ఎప్పుడూ బిజీగా ఉంటారు.. ఒత్తిడితో ఉంటారు. ఎక్కువగా టైం కేటాయించడానికి కుదరదు. అదీగాక ఒకే వృత్తిలో ఉంటే డేటింగ్ చేయడం కష్టం. అందుకే సినిమా వాళ్లతో డేటింగ్ చేయాలని లేదని చెప్పింది జాన్వి కపూర్.

జాన్వీ కపూర్ బిజినెస్ మెన్ శిఖర్ వహారియాతో ప్రేమలో ఉందని చెప్పుకుంటున్నారు. బాలీవుడ్ ఈవెంట్స్ లో కూడా జాన్వీ కపూర్ అతనితో కనిపించింది. ప్రస్తుతం దేవర సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాతో అమ్మడు తెలుగులో కూడా క్రేజ్ పెంచుకోవాలని చూస్తుంది. దేవర సినిమా రెండు భాగాలుగా వస్తుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.