Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఒక్క రోజులో ఎంత మార్పు జాన్వీ...!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతుంది

By:  Tupaki Desk   |   1 Nov 2023 1:30 PM GMT
పిక్ టాక్ : ఒక్క రోజులో ఎంత మార్పు జాన్వీ...!
X

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతుంది. అయితే ఇప్పటి వరకు ఈ అమ్మడికి ఒక్కటంటే ఒక్కటి కూడా కమర్షియల్‌ హిట్ పడలేదు. అయినా కూడా ఇలాంటి హాట్ ఫోటో షూట్స్ కారణంగా పాన్ ఇండియా హీరోయిన్ అంటూ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.


తాజాగా జియో వారి ఈవెంట్‌ కోసం జాన్వీ కపూర్‌ ఇలా హాట్ లుక్ లో అలరించింది. రెగ్యులర్ గా సోషల్‌ మీడియా ద్వారా తన భిన్నమైన ఫోటోలు మరియు వీడియో లు షేర్‌ చేసే జాన్వీ కపూర్‌ 24 గంటల వ్యవధిలో షేర్‌ చేసిన రెండు ఫోటోలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

నిన్న ఎన్టీఆర్ తో నటిస్తున్న దేవర సినిమాలో ఇలా కనిపించబోతున్నాను అంటూ జాన్వీ కపూర్‌ లంగా ఓనీ లో ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. అందులో నడుము అందం చూపిస్తూ ఒక పల్లెటూరు అమ్మాయి మాదిరిగా క్యూట్‌ గా కనిపించింది. అయితే నేడు షేర్‌ చేసిన ఫోటోల్లో టాప్ లెస్ ఔట్ ఫిట్ లో క్లీ వేజ్ షో చేస్తూ హాట్ గా కనిపిస్తోంది.

ఒక్క రోజు గ్యాప్‌ లో ఇంత వేరియేషన్‌ ఏంటి అమ్మడు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఫోటో షూట్స్ విషయం లో ఇంతగా వేరియేషన్స్ చూపిస్తున్న కారణంగానే ఈ అమ్మడికి ఈ రేంజ్‌ లో సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ దక్కింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నటిగా దేవర సినిమా తో జాన్వీ కపూర్ తన మొదటి బ్లాక్ బస్టర్ ఖాతాను తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు హిందీలో కూడా ఈ అమ్మడు సినిమాలు మరియు సిరీస్ ల్లో నటిస్తోంది. తెలుగు లో ప్రస్తుతానికి ఒకటే సినిమాను చేస్తున్న ఈ అమ్మడు ముందు ముందు టాలీవుడ్‌ లో బిజీ హీరోయిన్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.