Begin typing your search above and press return to search.

ప్రియుడితో జంట‌గా శ్రీవారి చెంత జాన్వీ క‌పూర్!

త‌న లుక్ కి సంబంధించిన పోస్ట‌ర్ రిలీజ్ చేసి జాన్వీకి శుభాంకాక్ష‌లు తెలియ‌జేసారు.

By:  Tupaki Desk   |   6 March 2024 10:22 AM GMT
ప్రియుడితో  జంట‌గా శ్రీవారి చెంత జాన్వీ క‌పూర్!
X

అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీక‌పూర్ నేటితో 27వ వ‌సంతంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అమ్మ‌డి పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకుని అభిమానులంతా సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలియ‌జేసారు. అలాగే `దేవర` టీమ్ సైతం జాన్వీని సర్ ప్రైజ్ చేసింది. త‌న లుక్ కి సంబంధించిన పోస్ట‌ర్ రిలీజ్ చేసి జాన్వీకి శుభాంకాక్ష‌లు తెలియ‌జేసారు.

ఇక జాన్వీ మాత్రం ఇదే రోజున తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో పాల్గొన్న‌ట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు సీనియ‌ర్ న‌టి మ‌హేశ్వ‌రి.. ప్రియుడు శిఖ‌ర్ ప‌హారియా..ఓర్రి కూడా ద‌ర్శ‌నం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఇందులో జాన్వీ క‌పూర్ లంగావోణీ ధ‌రిం చింది.

ప్ర‌త్యేక ద‌ర్శనం అనంత‌రం జాన్వీ న‌డుచుకుంటూ వ‌స్తుంటే అభిమానులు ఆమెని చూస్తు స‌ర్ ప్రైజ్ ఫీల‌య్యారు. ఆలయ వెలుపలకు వచ్చినా జాన్వీ కపూర్ తో సెల్పీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. సాధార‌ణంగా త‌న సినిమా రిలీజ్ కి ముందు శ్రీవారిని త‌ప్ప‌క ద‌ర్శించుకుంటారు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఇప్ప‌టికే ఓసారి ద‌ర్శ‌నం చేసుకున్నారు. తాజాగా పుట్టిన రోజు కావ‌డంతో ద‌ర్శ‌నంకు వెళ్లింది. మంగ‌ళ‌వారం రాత్రే ఆమె తిరుమ‌ల చేరుకున్న‌ట్లు తెలుస్తోంది.

జాన్వీ కపూర్ తెలుగులో జూనియర్ ఎన్టిఆర్ తో కలసి `దేవర` సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది పాన్ ఇండియా చిత్రం. అలాగే రామ్ చ‌ర‌ణ్ 16వ సినిమాలోనూ ఈ అమ్మ‌డినే హీరోయిన్ గా ఫైన‌ల్ చేసారు. ఇక హిదీలో `బడే మియాన్ చోటే మియన్` లో న‌టిస్తోంది. ఇంకా అమ్మ‌డి చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్ లు ఉన్నాయి.