Begin typing your search above and press return to search.

అంబానీ పెళ్లిలో జాన్వీని విడిచిపెట్ట‌ని బోయ్‌ఫ్రెండ్

By:  Tupaki Desk   |   4 March 2024 4:31 AM GMT
అంబానీ పెళ్లిలో జాన్వీని విడిచిపెట్ట‌ని బోయ్‌ఫ్రెండ్
X

అనంత్ అంబానీ - రాధికా మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ ఉత్సవాల్లో శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు, జూ.అతిలోక సుంద‌రి జాన్వీ క‌పూర్ సంద‌డి బోలెడంత చ‌ర్చ‌కు తెర‌తీసింది. జాన్వీ క‌పూర్ త‌న సోద‌రి ఖుషీ క‌పూర్ తో క‌లిసి ఈ వేడుక‌ల్లో సంద‌డి చేసింది. అయితే జాన్వీక‌పూర్ తో పాటు త‌న బోయ్ ఫ్రెండ్ శిఖ‌ర్ ప‌హారియా వేడుక ఆద్యంతం క‌నిపించాడు. దీనిపై ఇప్పుడు బోలెడన్ని గుస‌గుస‌లు..

అంబానీల పెళ్లి వేడుక ఆద్యంతం జాన్వీ క‌పూర్ త‌న స్నేహితుడు శిఖ‌ర్ తోనే క‌నిపించింది. ఓసారి త‌న సోద‌రుడు అర్జున్ క‌పూర్ తో పాటు దిగిన ఫోటోలో కూడా శిఖ‌ర్ క‌నిపించారు. జాన్వీ చెంతే నిలుచుని అత‌డు ఫోజులిచ్చాడు. అలాగే క‌త్రిన‌తో పాటు దిగిన వేరొక పోటోలో జాన్వీతో పాటు శిఖ‌ర్ ఉన్నాడు. ఇంత‌లోనే ఇప్పుడు అంబానీల ఆలయ వేడుకలకు తన సోదరి ఖుషీతో క‌లిసి విచ్చేసిన జాన్వీ క‌పూర్ వెంటే శిఖర్ పహారియా కూడా ఉన్నాడు. ఈ ఉత్స‌వంలో జాన్వి చీర‌లో ఎంతో అందంగా కనిపిస్తోంది. త‌న‌తో పాటు ఖుషీ కూడా హాఫ్ శారీలో ముగ్ధ మ‌నోహ‌ర రూపంతో ఆక‌ట్టుకుంది. శిఖ‌ర్ ట్రెడిష‌న‌ల్ దోతీ కుర్తాలో స్మార్ట్ గా క‌నిపించాడు. జాన్వీ-శిఖ‌ర్ ఒక‌రికొక‌రు ఎంతో స‌న్నిహితంగా క‌నిపించ‌డ‌మే గాక‌.. మాట్లాడుకుంటూ వెళుతున్న వీడియోలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి.

శిఖర్ పహారియా- జాన్వీ కపూర్ ప్రేమలో పాల్గొన్నట్లు చాలా కాలంగా పుకార్లు ఉన్నాయి. ఆ ఇద్ద‌రు ప‌లు సందర్భాలలో కలిసి కనిపించారు. ఇటీవల ఖుషీ కపూర్ పుట్టినరోజు వేడుకకు కూడా జంట‌గా హాజరయ్యారు. అలాగే మాల్దీవులలో విహారయాత్రను ఆస్వాధించిన ఫోటోలు వీడియోలు వైర‌ల్ అయ్యాయి. జాన్వీకి అత‌డు కేవ‌లం స్నేహితుడు మాత్ర‌మేనా? అంత‌కుమించి ఇంకేదైనా జ‌రుగుతోందా? అన్న‌ది నిరంత‌ర చ‌ర్చ‌.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. జాన్వి తదుపరి రాజ్‌కుమార్ రావుతో కలిసి `మిస్టర్ అండ్ మిసెస్ మాహి`లో కనిపించనుంది. ఈ చిత్రం ఒక స్పోర్ట్స్ డ్రామా. రూహి తర్వాత జాన్వీ - రాజ్‌కుమార్‌ల రెండవ కలయిక ఇది. పాన్-ఇండియా చిత్రం `దేవర`లో జూనియర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న జాన్వీ న‌టిస్తోంది.

https://www.instagram.com/reel/C4D_MmwqRC2/?utm_source=ig_web_copy_link