Begin typing your search above and press return to search.

జాన్వీ.. దేవరను ఏ రేంజ్ లో లేపుతోందంటే..

ఇక ఈ బ్యూటీ కి అసలు ఇంతవరకు ఒక్క సక్సెస్ కూడా ఎందుకు రాలేదు అనే సందేహాలు చాలానే వస్తూ ఉంటాయి

By:  Tupaki Desk   |   5 Jan 2024 9:46 AM GMT
జాన్వీ.. దేవరను ఏ రేంజ్ లో లేపుతోందంటే..
X

జాన్వీ కపూర్.. హీరోయిన్ గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ లేకపోయినప్పటికీ అమ్మడికి గ్లామర్ విషయంలో మాత్రం స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ అయితే క్రేజ్ ఉంది. ఆమె ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో నిమిషాల్లోనే ట్రెండింగ్ లిస్టు లోకి వచ్చేస్తాయి. అందం విషయంలో అయితే ఎలాంటి విమర్శలు అందుకోకుండా అమ్మడు తన ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది.

ఇక ఈ బ్యూటీ కి అసలు ఇంతవరకు ఒక్క సక్సెస్ కూడా ఎందుకు రాలేదు అనే సందేహాలు చాలానే వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆమె సరైన ట్రాక్ లోకి వచ్చినట్లుగా చెబుతోంది. అది కూడా దేవర సినిమాను ఒకవైపు పొగిడేస్తూనే మరొకవైపు తన పాత్ర పై కూడా అమ్మడు చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యింది.

జాన్వి కపూర్ ఎప్పటినుంచో తెలుగులో మంచి సినిమా చేయాలని ఆలోచన ఉంది. ఇక ఇప్పుడు మొత్తానికి ఆమె దేవర సినిమాతో సరైన టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ఇదివరకే స్పందించింది. ఇక రీసెంట్గా జాన్వికపూర్ కాఫీ విత్ కరణ్ షాలో దేవర సినిమాలోని తన పాత్ర గురించి తెలియజేసింది.

పూర్తిస్థాయిలో మాట్లాడలేదు కానీ ఇంతకుముందు తన సినిమాలు తన క్యారెక్టర్లు ఒక లెక్క ఇప్పుడు చేయబోయే తంగం క్యారెక్టర్ మరొక్క లెక్క అనేలా స్పందించింది. దేవర సెట్లోకి వెళ్ళగానే ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను అనే భావన కలిగింది. ఇది తనకు కావలసిన అసలైన క్యారెక్టర్ అని అనిపించినట్లు.. చెబుతూ దేవర సెట్లో ఉన్నప్పుడు ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ కూడా ఒక వర్క్ షాప్ లాగా అనిపించింది అని వివరణ ఇచ్చింది.

ఇకనుంచి తన పాత్రల సెలక్షన్ కూడా ఇదే తరహాలో ఉంటుంది అని తెలియజేసింది. మొత్తానికి ఒక అద్భుతమైన టీ తో కెరియర్కు ఉపయోగపడే విధంగా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను అన్నట్లుగా జాన్వీ మాట్లాడింది. దీంతో ఒకవైపు ఆమె తంగం క్యారెక్టర్ ను పొగుడుతూనే మరొకవైపు దేవర సినిమాపై కూడా హైప్ క్రియేట్ చేసింది. అలాంటి బిగ్గెస్ట్ టాక్ షోలో అమ్మడు దేవర సినిమా గురించి ఈ విధంగా మాట్లాడింది అంటే ఎంతగా నమ్మకం పెట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఈ సినిమాతో ఆమె కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.