Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : శ్రీవారి చెంత చీర కట్టులో జాన్వీ కపూర్‌

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ రెగ్యులర్ గా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది

By:  Tupaki Desk   |   5 Jan 2024 7:40 AM GMT
పిక్ టాక్‌ : శ్రీవారి చెంత చీర కట్టులో జాన్వీ కపూర్‌
X

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ రెగ్యులర్ గా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. తన తల్లి బతికి ఉన్నప్పటి నుంచి కూడా రెగ్యులర్‌ గా శ్రీవారి దర్శనం కి వచ్చే జాన్వీ తన తల్లి లేకున్నా కూడా స్నేహితులతో లేదా ఇతర కుటుంబ సభ్యులతో శ్రీవారి చెంతకు వస్తుంది.


ప్రతి సంవత్సరం ఆరంభంలో కచ్చితంగా జాన్వీ కపూర్‌ తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈసారి జాన్వీ కపూర్ నేడు తిరుమలకు వచ్చి కాలి నడకన పైకి ఎక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంది.


దర్శనం తర్వాత గోవిందా గోవిందా అంటూ తెలుగు లో రాసి ఇన్‌ స్టా లో ఈ అందమైన ఫోటోలను షేర్‌ చేసింది. అందాల జాన్వీ కపూర్‌ ఫోటోలు ఎప్పుడు కూడా సోషల్‌ మీడియా ద్వారా వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు తిరుమలలో ఉన్న జాన్వీ ఫోటోలు వైరల్ అయ్యాయి.


చీర కట్టులో జాన్వీ కపూర్‌ చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ అందం టాలీవుడ్‌ లో ఎన్టీఆర్‌ కు జోడీగా దేవర సినిమా తో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా ఈ అమ్మడి మొదటి విజయాన్ని దేవరతో దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.