Begin typing your search above and press return to search.

బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్.. రీజన్ చెప్పిన జాన్వీ

అలాగే తాజాగా ఓ టాక్‌షోలో పాల్గొన్న జాన్వీ.. తన మొదటి బాయ్ ఫ్రెండ్‌తో రిలేషన్ షిప్ ను ఎందుకు బ్రేక్ చేయాల్సి వచ్చిందో కూడా తెలిపింది.

By:  Tupaki Desk   |   28 Aug 2023 11:52 AM GMT
బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్.. రీజన్ చెప్పిన జాన్వీ
X

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తరచుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కూడా నేడు ఆగస్ట్ 28న వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి ఆలయ అధికారులు.. ఆమెకు ఎప్పటిలాగే దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అయిపోయాక రంగనాయకుల మండపంలో వేదపండితులందరు కలిసి ఆమెకు అశీర్వచనం చేసి స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.

ఈ నేపథ్యంలో సినీ ప్రియులు, ఆమె అభిమానులు జాన్వీని అభినందించడం మొదలుపెట్టారు. ఎందుకంటే సాధారణంగా సెలబ్రిటీలు అంటే ఎప్పుడు ఫ్యాషన్ గా కనిపిస్తారు. అయితే ఆధ్యాత్మిక యాత్రల్లో ఉన్నప్పుడు ట్రెడిషనల్ గా ఉంటారు. జాన్వీ కూడా అంతే.. తిరుపతి ఆలయానికి ఎన్ని సార్లు వచ్చినా క్రమం తప్పకుండా ఎంతో ట్రెడిషనల్ గా చీరకట్టులోనే వస్తుంది. రియల్ స్క్రీన్ ఫుల్ హాట్ గా డ్రెస్సింగ్ చేసుకునే ఈ బ్యూటీ రియల్ లైఫ్ లో మాత్రం ఎంతో సింపుల్ గా ఉంటూ అలానే గుడికి వస్తూ.. అభిమానుల మనసులను దోచుకుంటుంది.

అలాగే తాజాగా ఓ టాక్‌షోలో పాల్గొన్న జాన్వీ.. తన మొదటి బాయ్ ఫ్రెండ్‌తో రిలేషన్ షిప్ ను ఎందుకు బ్రేక్ చేయాల్సి వచ్చిందో కూడా తెలిపింది. నేను, నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్‌ సీక్రెట్ గా మీట్ అయ్యే వాళ్లం. ఒకరితో ఒకరం ఎన్నో అబద్ధాలు కూడా చెప్పుకునేవాళ్లం. ఓ సారి నా టైమ్ బాగోలేక నేను చెప్పిన ఓ అబద్ధం తెలిసిపోయింది. ఆ కారణంగా ఆ రిలేషన్ బ్రేక్ అయిపోయింది. అయినా నాకు బాయ్ ఫ్రెండ్‌ ఉండకూడదని నా తల్లిదండ్రులు కూడా చెప్పారు. వాళ్లతో సిన్సియర్ గా ఉంటే అన్నీ పరిస్థితులు ఈజీగా మారుతాయని అర్థమైంది. వారి నిర్ణయాలకు తగ్గట్టుగా నడుచుకుంటే భవిష్యత్తు బాగుంటుందనేది నా అభిప్రాయం అని జాన్వీ చెప్పుకొచ్చింది. అయితే తన బ్రేకప్ ఎప్పుడు జరిగిందో క్లారిటీ ఇవ్వలేదు.

ఇక జాన్వీ సినిమాల విషయానికొస్తే.. సీనియర్ నటి శ్రీదేవి కుమార్తెగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. కంటెంట్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యమిస్తూ.. ఓ స్పెషల్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. అటు నార్త్ లో ఇటు సౌత్ లో ఛాన్స్ లను అందుకుంటోంది. రీసెంట్ గా బవాల్‌ చిత్రంతో సక్సెస్ అందుకుంది.

అలాగే ఎన్టీఆర్ దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో డీగ్లామరైజ్‌ పాత్రలో కనిపించనుందని సమాచారం అందింది. రీసెంట్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంది. సెట్ లో అందరూ తనతో ఎంతో ప్రేమగా ఉన్నారని చెప్పింది. అందుకే కెమెరా ముందు స్వేచ్ఛగా నటించగలిగినట్లు పేర్కొంది. ఇక్కడి వారి ప్రేమను చూస్తుంటే సొంతింటికి వచ్చినట్లుగా అనిపిస్తుందని తన మనసులోని మాటను తెలిపింది.