Begin typing your search above and press return to search.

వీడియో: చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న న‌ట‌వార‌సురాళ్లు

వినోద ప్రపంచంలో నిజమైన స్నేహితులు జాన్వీ - సారా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారు.

By:  Tupaki Desk   |   19 March 2024 12:30 AM GMT
వీడియో: చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న న‌ట‌వార‌సురాళ్లు
X

జిమ్‌లో చెమటలు చిందించినా లేదా రెడ్ కార్పెట్‌పై హంస‌న‌డ‌క‌ల‌తో అబ్బురపరిచినా ఆ ఇద్ద‌రు న‌ట‌వార‌సురాళ్లు ఫిట్‌నెస్‌లో త‌మ‌దైన ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూనే ఉన్నారు. వినోద ప్రపంచంలో నిజమైన స్నేహితులు జాన్వీ - సారా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారు.

ఈ ఇద్ద‌రూ క‌లిసి జిమ్‌కి వెళితే ర‌చ్చ ర‌చ్చే. తాజాగా సారా అలీఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. త‌న స్నేహితురాలు జాన్వీ కపూర్‌తో కలిసి తన క‌ఠిన‌మైన వ్యాయామ సెషన్ లో పాల్గొంది. ఇద్దరూ కలిసి అథ్లెటిక్ దుస్తులు ధరించారు. కొత్త లుక్ లో ప్రకంపనల‌కు తెర తీసారు. ఒక అభిమాని సారా- జాన్వీ జోడీ వ్యాయామ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రీపోస్ట్ చేశాడు. ఈ జంట ఫిట్‌నెస్ అంకితభావానికి ప్రశంసలు కురిపించాడు.

స్నేహితురాళ్లు జాన్వీ కపూర్ -సారా అలీఖాన్ పబ్లిక్ ఈవెంట్స్ లేదా మీడియా సమావేశాలలో కలిసినప్పుడల్లా వారి న‌డుమ‌ నిజమైన స్నేహం బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. అది అంద‌రిలో స్ఫూర్తి నింపుతుంది. వర్కౌట్ భాగస్వాములుగాను యువ‌త‌రానికి గోల్స్ సెట్ చేస్తున్నారు. ఇటీవల జిమ్ లో నిరంత‌ర సెష‌న్స్ ను అభిమానుల కోసం షేర్ చేస్తున్నారు. ఇది షోబిజ్ గ్లామర్‌కు మించి వారి బంధం లో డెప్త్ ను హైలైట్ చేస్తోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే ఇద్ద‌రు ప్ర‌తిభావ‌నులు వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. సారా అలీ ఖాన్ తాజా చిత్రం మర్డర్ ముబారక్ మార్చి 15న నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైంది. దీనికి హోమీ అదాజానియా దర్శకత్వం వహించారు. మిస్టరీ థ్రిల్లర్‌లో పంకజ్ త్రిపాఠి, విజయ్ వర్మ, కరిష్మా కపూర్, సంజయ్ కపూర్, డింపుల్ కపాడియా తదిత‌రులు న‌టించారు. సారా అద్భుత న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

త‌దుప‌రి స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన క‌థ‌తో రూపొందిన‌ దేశభక్తి చిత్రం `ఏ వతన్ మేరే వతన్‌`లో సారా క‌నిపించ‌నుంది. స్వాతంత్య్ర‌ సమరయోధురాలు ఉషా మెహతా పాత్రను సారా పోషించింది. బ్రిటిష్ వారి నుండి స్వాతంత్య్రం కోసం పోరాడిన మ‌హిళ క‌థ ఇది. కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ఆనంద్ తివారీ త‌దిత‌రులు నటించారు. మార్చి 21న ప్రైమ్ వీడియోలో ప్రీమియ‌ర్ అయింది. అనురాగ్ బ‌సు మెట్రో ఇన్ డినో చిత్రంలోను సారా న‌టిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలోకి రానుంది.

జాన్వీ కపూర్ కెరీర్ మ్యాట‌ర్‌కి వ‌స్తే.. 2023 రొమాంటిక్ డ్రామా `బవాల్` త‌ర్వాత `దేవ‌ర` చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. బ‌వాల్ చిత్రానికి నితేష్ తివారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, వరుణ్ ధావన్ కథానాయ‌కుడిగా నటించారు. ఈ చిత్రం OTTలో విడుదలైన తర్వాత మిశ్రమ సమీక్షలను అందుకుంది. త‌దుప‌రి ప్రాజెక్ట్ మిస్టర్ అండ్ మిసెస్ మహిలో రాజ్ కుమార్ రావుతో క‌లిసి క‌నిపించ‌నుంది. `దేవర: పార్ట్ 1`తో తెలుగు సినీరంగంలోకి ప్రవేశిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ త‌దిత‌రులు ఇందులో న‌టిస్తున్నారు. క‌పూర్ ఉలాజ్‌లో IFS అధికారి పాత్రను కూడా పోషిస్తుంది.