Begin typing your search above and press return to search.

'దేవర' కోసం జాన్వీ ఇప్పటి వరకు...!

తాజాగా ఒక చిట్‌ చాట్‌ లో జాన్వీ కపూర్ ఆ విషయాన్ని వెళ్లడించింది. ఇప్పటి వరకు తాను మూడు రోజులు మాత్రమే దేవర షూటింగ్‌ లో పాల్గొన్నాను.

By:  Tupaki Desk   |   25 Aug 2023 3:15 AM GMT
దేవర కోసం జాన్వీ ఇప్పటి వరకు...!
X

ఆర్ఆర్‌ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో స్టార్‌ డమ్‌ దక్కించుకున్న ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు చాలా సమయం తీసుకున్నారు. చాలా ఆలస్యంగా షూటింగ్‌ మొదలు పెట్టిన కొరటాల శివ స్పీడ్‌ గా చిత్రీకరణ చేస్తున్నాడట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరి వరకు సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అవ్వాలని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నాడు. అందుకు తగ్గట్లుగా ప్లాన్‌ చేస్తున్నాడట. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజులుగా జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు జాన్వీ కపూర్‌ మూడు రోజుల షూట్‌ లో మాత్రమే పాల్గొందట.

తాజాగా ఒక చిట్‌ చాట్‌ లో జాన్వీ కపూర్ ఆ విషయాన్ని వెళ్లడించింది. ఇప్పటి వరకు తాను మూడు రోజులు మాత్రమే దేవర షూటింగ్‌ లో పాల్గొన్నాను. వచ్చే నెలలో మళ్లీ షూటింగ్ కు జాయిన్‌ అవ్వబోతున్నట్లుగా జాన్వీ కపూర్ ప్రకటించింది. ఎన్టీఆర్ తో కలిసి నటించేందుకు గాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా జాన్వీ కపూర్ పేర్కొంది.

ఇప్పటి వరకు ఎన్టీఆర్ తో పాటు ఇతర ముఖ్య నటీనటుల కు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. త్వరలోనే జాన్వీ కపూర్‌ మరియు ఎన్టీఆర్‌ పై పాటల చిత్రీకరణ మరియు లవ్‌ సన్నివేశాల చిత్రీకరణ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే విడుదల అయిన ఎన్టీఆర్‌ లుక్ మరియు జాన్వీ కపూర్ అందాల లంగా ఓణీ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ ను బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్న యూనిట్‌ సభ్యులు త్వరలోనే టీజర్ తో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.