Begin typing your search above and press return to search.

వింబుల్డ‌న్ 2025: షో స్టాప‌ర్ జాన్వీ క‌పూర్

ప్ర‌స్తుతం క‌థానాయిక‌గా కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీగా ఉన్న ఈ న‌ట‌వార‌సుర‌లు, సోష‌ల్ మీడియాల్లోను స్పీడ్ గానే ఉంది.

By:  Tupaki Desk   |   13 July 2025 10:10 AM IST
వింబుల్డ‌న్ 2025: షో స్టాప‌ర్ జాన్వీ క‌పూర్
X

త‌న‌దైన అందం, ప్ర‌తిభ‌తో భారీగా ఫాలోయింగ్ పెంచుకుంది జాన్వీ క‌పూర్. ప్ర‌స్తుతం క‌థానాయిక‌గా కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీగా ఉన్న ఈ న‌ట‌వార‌సుర‌లు, సోష‌ల్ మీడియాల్లోను స్పీడ్ గానే ఉంది. అభిమానుల‌కు ఇన్ స్టా వేదిక‌గా నిరంత‌రం అప్ డేట్స్ ని అందిస్తూనే ఉంది. తాజాగా ఈ బ్యూటీ లండ‌న్ లో జ‌రుగుతున్న వింబుల్డ‌న్- 2025 సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ప్రియుడు శిఖ‌ర్ ప‌హారియాతో క‌లిసి జాన్వీ మెరుపులు మెరిపించింది.

ముఖ్యంగా జాన్వీ క‌పూర్ ధ‌రించిన స్పెష‌ల్ డిజైన‌ర్‌ డ్రెస్ పైనే యువ‌త‌రం ఫోక‌స్ చేసింది. జాన్వీ ఎంపిక చేసుకున్న యాక్సెస‌రీస్, ఆభ‌ర‌ణాలు, దుస్తుల గురించి యూత్ ఆరాలు తీసారు. ఇది స్పెష‌ల్ గా డిజైన్ చేసిన మిడీ డ్రెస్.. జాన్వీ టోన్డ్ సొగ‌సుల్ని ఆవిష్క‌రిస్తున్న ఈ ప్ర‌త్యేక‌మైన మిడీ డ్రెస్ రొటీన్ పొట్టి మిడీ కంటే భిన్న‌మైన ఎంపిక‌. దీని ఖ‌రీదు సుమారు రూ.3.9 ల‌క్ష‌లు అని లెక్క‌లు తీస్తున్నారు. ఇక ఎంపిక చేసుకున్న లాంగ్ మిడీకి త‌గ్గ‌ట్టుగానే క‌ళ్ల‌కు గ్లాసెస్ ని జోడించింది జాన్వీ.

ఫ్రీస్ట‌యిల్ లో ఈ లుక్ సంథింగ్ స్పెష‌ల్‌గా ఎలివేట్ అయింద‌నే చెప్పాలి. జాన్వీ ట్రెడిష‌న‌ల్ దుస్తుల్లోను టూ హా* గా ఉందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కెరీర్ ప‌రంగా చూస్తే.. జాన్వీ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న పెద్ది చిత్రంలో న‌టిస్తోంది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు స‌నా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.