సాఫ్ట్ గ్లామ్ వైబ్స్‌లో మెరిసిన జాన్వీ కపూర్ !
బాలీవుడ్ క్యూట్ బ్యూటీ జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫోటో షూట్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
By: Madhu Reddy | 11 July 2026 8:49 PM ISTబాలీవుడ్ క్యూట్ బ్యూటీ జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫోటో షూట్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. "ప్రస్తుతం నా జీవితాన్ని వింటేజ్ ఫిల్టర్ ద్వారా చూస్తున్నాను" అంటూ ఒపో రెనో 16 సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా దిగిన కొన్ని క్రేజీ పిక్స్‌ను షేర్ చేసింది. పర్పుల్ ప్రింటెడ్ డ్రెస్, అలాగే ఆలివ్ గ్రీన్ జాకెట్ లుక్స్‌లో సాఫ్ట్ గ్లామ్ వైబ్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. జాన్వీ నేచురల్ గ్లో, మెరిసే కళ్లు ఈ ఫోటోలకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి.
వింటేజ్ ఫిల్టర్‌లో జాన్వీ మ్యాజిక్:
జాన్వీ కపూర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సరికొత్త ఒపో మొబైల్ పాప్ క్యామ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఈ మధ్య కాలంలో తనకు వింటేజ్ లుక్స్ అంటే ఎంత ఇష్టమో చెప్పుకొచ్చింది. ఇక కొన్ని క్షణాలు కాస్త ఇంపర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడే చూడటానికి చాలా బాగుంటాయంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలలో జాన్వీ ఎంతో రిలాక్స్‌డ్‌గా, పెదవులపై చిన్న చిరునవ్వుతో కనిపిస్తూ కుర్రకారు మనసు దోచేస్తోంది.
ఆకట్టుకుంటున్న రెండు రకాల స్టైలిష్ లుక్స్:
ఈ ఫోటో షూట్‌లో జాన్వీ కొన్ని డిఫరెంట్ లుక్స్‌లో మెరిసింది. ఒక ఫోటోలో వైబ్రెంట్ పర్పుల్ ప్రింటెడ్ స్లీవ్‌లెస్ డ్రెస్ వేసుకుని, చేతులకు బోహేమియన్ స్టైల్ బ్రాస్‌లెట్లు, మెడలో సింపుల్ లాకెట్ చైన్‌తో చాలా ట్రెండీగా కనిపించింది. ఇక మరో పిక్‌లో ఒలివ్ గ్రీన్ క్రాప్డ్ యుటిలిటీ డెనిమ్ జాకెట్, లోపల రాయల్ బ్లూ టీషర్ట్, క్లాసిక్ బ్లూ జీన్స్ వేసుకుని పక్కా స్టైలిష్ మోడ్రన్ అవతార్‌లో దర్శనమిచ్చింది. బ్రౌన్ లెదర్ బెల్ట్ వింటేజ్ లుక్‌ను మరింత ఎలివేట్ చేసింది.
అతిలోక సుందరి కూతురిగా ఎంట్రీ:
అతిలోక సుందరి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ ల ముద్దుల కూతురైన జాన్వీ కపూర్.. 2018లో వచ్చిన 'ధడక్' సినిమాతో బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే యాక్టింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేసి, భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
టాలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్టులు:
టాలీవుడ్‌లోకి కూడా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా 'పెద్ది' లోనూ నటిస్తూ సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.
జాన్వీ కపూర్ సినిమాలతోనే కాకుండా ఇలాంటి క్రేజీ ఫోటో షూట్లతో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్లతో పాటు కంటెంట్ ఉన్న కథలను బ్యాలెన్స్ చేస్తూ అమ్మలాగే టాలీవుడ్, బాలీవుడ్‌లను ఏలేయడానికి రెడీ అవుతోంది. మరి ఈ వింటేజ్ బ్యూటీ రాబోయే సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఇంకెలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి..
