Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : బంగారు వర్ణంలో మెరుస్తున్న జాన్వీ కుమారి

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్‌ చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   15 July 2025 12:31 PM IST
పిక్‌టాక్ : బంగారు వర్ణంలో మెరుస్తున్న జాన్వీ కుమారి
X

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్‌ చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. తల్లి పేరు, తండ్రి బ్రాండ్‌ ఇమేజ్‌ను వినియోగించుకోకుండానే సినిమా ఆఫర్లు దక్కించుకునే స్థాయికి ఎదిగింది. బాలీవుడ్‌లో ఈమె చేసిన మొదటి సినిమా నుంచి మొన్న వచ్చిన హోమ్బౌండ్ సినిమా వరకు నిరాశనే మిగిల్చాయి. కొన్ని సినిమాలు నటిగా గుర్తింపు తెచ్చి పెట్టినప్పటికీ ఏ ఒక్క సినిమా కమర్షియల్‌గా బ్లాక్‌ బస్టర్‌ విజయాలను సొంతం చేసుకోలేక పోయాయి. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈమె చేసిన దేవర సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.


దేవర విజయంతో టాలీవుడ్‌లో వరుస ఆఫర్లను ఈ అమ్మడు సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే రామ్‌ చరణ్‌ తో కలిసి బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ మూవీలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో తెలుగు సినిమాకు కమిట్‌ అయిన జాన్వీ వచ్చే ఏడాదిలో ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో మాత్రం బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో సందడి చేసేందుకు గాను రెడీ అవుతోంది. త్వరలో జాన్వీ కపూర్‌ 'సన్నీ సంస్కారీ కి తులసి కుమారి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాలో తులసి కుమారి పాత్రలో జాన్వీ కపూర్ కనిపించబోతుంది.

ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. మొన్నటి వరకు సెప్టెంబర్‌లో ఈ సినిమాను విడుదల చేస్తామంటూ చెబుతూ వచ్చిన మేకర్స్ ఇప్పుడు కొత్త డేట్‌ను అక్టోబర్‌కి మార్చారు. అక్టోబర్‌ 2, 2025న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. కొత్త విడుదల తేదీని ప్రకటించేందుకు గాను మేకర్స్ జాన్వీ కపూర్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో తులసి కుమారిగా జాన్వీ కపూర్‌ను చూడవచ్చు. చీర కట్టులో జాన్వీ కపూర్‌ నడుము అందం చూపిస్తూ కవ్విస్తుంది. బంగారు వర్ణపు బ్యాగ్‌ గ్రౌండ్‌తో పాటు, అదే కలర్‌ చీర, బ్లౌజ్‌ ధరించిన జాన్వీ కపూర్‌ చూపు తిప్పనివ్వడం లేదు.

తులసి కుమారి పాత్ర కాస్త బోల్డ్‌గా ఉంటుందని, జాన్వీ కపూర్‌ గతంతో పోల్చితే ఈ సినిమాలో నటనతో మరింతగా మెప్పించడం ఖాయం అంటూ మేకర్స్ అంటున్నారు. టైటిల్‌ రోల్‌ పోషిస్తుంది కనుక ఖచ్చితంగా జాన్వీ కపూర్‌ నుంచి ప్రేక్షకులు నటనతో పాటు, అందాల ఆరబోత కాస్త ఎక్కువగానే ఆశిస్తారు. కనుక సినిమాలో ఖచ్చితంగా ఆ రెండు అంతకు మించి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ పోస్టర్‌ను చూస్తూ ఉంటే జాన్వీ కపూర్‌ అందాల ఆరబోతను ఈ సినిమాలో దండిగానే చూస్తాము అనే విశ్వాసం ను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఇప్పటి వరకు దక్కించుకోని కమర్షియల్‌ విజయాన్ని తులసి కుమారిగా జాన్వీ కపూర్‌ అందుకుంటుందా అనేది చూడాలి.