రన్నింగ్ వ్యాన్ లో పరోటాలు సూపర్ టేస్ట్!
ప్రస్తుతానికి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తోంది. అయితే జాన్వీకి ఖాళీగా ఉంటే స్నేహితులతో, కుటుంబంతో తిరగడం అంటే చాలా సరదా అట.
By: Tupaki Desk | 7 May 2025 3:00 AM ISTఅతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ , టాలీవుడ్ లో తిరుగులేని నాయికగా దూసుకుపోతుంది. ఇంకా కోలీవుడ్ లో లాంచ్ అవ్వ లేదు. కానీ ఎప్పుడు లాంచ్ అవుతుందా? అని అక్కడ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందు కు డాడ్ బోనీ కపూర్ బ్యాకెండ్ లో మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. ఆయన ప్రణాళిక ప్రకారమే జాన్వీ ముందు కెళ్తుంది.
ప్రస్తుతానికి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తోంది. అయితే జాన్వీకి ఖాళీగా ఉంటే స్నేహితులతో, కుటుంబంతో తిరగడం అంటే చాలా సరదా అట. స్నేహితులతో కలిసి కొత్త ప్రాంతా లకు నాలుగైదు రోజుల పాట వెళ్లడం చిన్న నాటి నుంచి ఉన్న అలవాటుగా చెప్పుకొచ్చింది. వీటన్నింటి కంటే చిన్నప్పుడు టూర్ వెళ్లడం అంటే మహా సరదాగా ఉండేదంది. ఇంట్లో టూర్ వెళ్దామంటే అమ్మడు ఎగిరిగంతేసిదట.
కుటుంబంతో కలిసి వ్యాన్ లో ప్రయాణం చేసిన రోజులు ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయంది. రన్నింగ్ వ్యాన్ లో పరోటాలు...చపాతీలు , తేప్లాలు తింటు ప్రయాణం చేయడం అంటే ఎంతో ఇష్టం ఉండేదంది. ప్రయాణాల్లో ఆకలి ఎక్కువగా వేస్తుందంటారు? అది తాను కూడా ఎక్స్ పీరియన్స్ చేసానంది. రోజు ఇంట్లో తినడం కంటే ప్రయాణాల్లో ఇంకొంచెం ఎక్కువగా తింటానంది.
అదే సమయంలో వ్యాన్ లో పాటలు వింటూ ప్రయాణం చేస్తే ఆ మజా వేరుగా ఉంటుందంది. జాన్వీ కూడా మంచి పుడీ. ఆ మధ్య పుడ్ పాయిజినింగ్ కారణంగా అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. చెన్నై నుంచి ముంబైకి ప్రయాణించే సమయంలో చెన్నై ఎయిర్ పోర్టులో పుడ్ కారణంగా అస్వస్తకు గురైనట్లు వార్తలొచ్చాయి.
