అందాల జాన్వీ.. ఒక్కో మూవీకి రూ.కోటి పెంచేస్తుందా?
ఇప్పుడు రీసెంట్ గా జాన్వీ సెట్స్ లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే తన టాలీవుడ్ డెబ్యూ దేవరకు రూ.5 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్న జాన్వీ.
By: Tupaki Desk | 25 July 2025 8:27 AM ISTఅలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అమ్మడు.. వరుస ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అటు బాలీవుడ్ లో.. ఇటు టాలీవుడ్ లో పలు సినిమాల్లో యాక్ట్ చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది ముద్దుగుమ్మ.
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన జాన్వీ కపూర్.. ఆ సినిమాలో ఎంతో అందంగా కనిపించి మెప్పించిందనే చెప్పాలి. ఆ మూవీ సీక్వెల్ లో కూడా నటించనుంది. ఆమె రోల్ కు మంచి ప్రాధాన్యం ఉన్నట్లు ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చేసింది.
ప్రస్తుతం మరో స్టార్ హీరో రామ్ చరణ్ పెద్ది సినిమాలో యాక్ట్ చేస్తోంది జాన్వీ. స్పోర్ట్స్ కమ్ రూరల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ.. వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. అందుకు అనుగుణంగా చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు మేకర్స్.
ఇప్పుడు రీసెంట్ గా జాన్వీ సెట్స్ లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే తన టాలీవుడ్ డెబ్యూ దేవరకు రూ.5 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్న జాన్వీ.. ఇప్పుడు పెద్ది మూవీకి గాను రూ.6 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగులో రెండో చిత్రానికే కోటి రూపాయలను అమ్మడు పెంచేసిందని సమాచారం.
అదే సమయంలో అల్లు అర్జున్- అట్లీ సినిమాలోని ఓ రోల్ కోసం మేకర్స్ ఇటీవల జాన్వీ కపూర్ ను సంప్రదించారట. దీంతో ఆ సినిమాకు మరో కోటి పెంచేసి మొత్తంగా రూ. 7 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్ తగ్గించమని జాన్వీతో మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
కానీ ఆమె మాత్రం వెనక్కి తగ్గడం లేదని టాక్ వినిపిస్తోంది. అలా పారితోషికం విషయంలో యంగ్ బ్యూటీ శ్రీలీలను జాన్వీ కపూర్ ఫాలో అవుతున్నట్లు ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే జాన్వీ కపూర్ ను సినిమాలోకి తీసుకుంటే.. నార్త్ లో కూడా యూజ్ అవుతుందని భావించే మేకర్స్ ఆమెను సంప్రదిస్తున్నారని అర్థమవుతుంది. కానీ ఆమె మాత్రం రెమ్యునరేషన్ పెంచుకుంటూపోతోందని వినికిడి.
