Begin typing your search above and press return to search.

అమ్మడు పెద్దితోనే ఆగిపోతుందా..?

శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ తన మదర్ లానే సౌత్ ఆడియన్స్ లో కూడా క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది.

By:  Tupaki Desk   |   11 Jun 2025 4:00 AM IST
అమ్మడు పెద్దితోనే ఆగిపోతుందా..?
X

శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ తన మదర్ లానే సౌత్ ఆడియన్స్ లో కూడా క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే అమ్మడు ఎన్ టీ ఆర్ దేవర పార్ట్ 1 సినిమాలో నటించింది. ఆ సినిమాలో తంగం పాత్రలో నటించిన జాన్వి ఆడియన్స్ ని గ్లామర్ తో మెప్పించింది. దేవర సినిమాలో జాన్వి పాత్ర అంతగా క్లిక్ అవ్వలేదు. కేవలం ఆ గ్లామర్ షో పాటల్లో మాత్రమే ఆమె హైలెట్ అయ్యింది. అయినా కూడా టాలీవుడ్ ఎంట్రీ జాన్వి కపూర్ కి బాగానే జరిగిందని చెప్పొచ్చు.

దేవర 1 తర్వాత దేవర 2లో ఆమె రోల్ చాలా బాగుంటుందని అంటున్నారు. ఐతే ఆ సినిమా వచ్చేందుకు టైం పట్టేలా ఉందని తెలిసిందే. ఇక దేవర తర్వాత జాన్వి కపూర్ రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ పట్టేసింది. బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో జాన్వి నటించడం ఆమెకు చాలా ప్లస్ అని చెప్పొచ్చు. ఉప్పెనతో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చి బాబు పెద్దితో చాలా పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నాడని తెలుస్తుంది.

జాన్వి కపూర్ పెద్ది తర్వాత తెలుగులో సినిమాలు చేసే అవకాశాలు లేవన్నట్టుగా పరిస్థితి కనబడుతుంది. దేవర తో జాన్వి ఏదైనా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందేమో అనుకోగా అది కాస్త జరగలేదు. పెద్ది లో ఏదైనా సాధ్యం అవుతుందేమో చూడాలి. పెద్ది విషయంలో ప్రతి యాస్పెక్ట్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుందని డైరెక్టర్ బుచ్చి చెబుతున్నాడు. మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా పెద్ది ఉంటుందని ఇప్పటికే పెద్ది ఫస్ట్ షాట్ తో చూపించాడు. ఇక రాబోతున్న సినిమా తో నెక్స్ట్ లెవెల్ రికార్డులు క్రియేట్ చేస్తుందని అంటున్నారు.

ఈ సినిమాతో జాన్వి కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తుంది. పెద్ది సక్సెస్ అయితే జాన్వికి మరిన్ని తెలుగు సినిమా ఛాన్స్ లు వస్తాయి. ఐతే ఈమధ్య నాని సినిమాలో జాన్వి నటిస్తుందని వార్తలు వచ్చాయి కానీ వాటిల్లో ఏది నిజం లేదని తెలుస్తుంది. పెద్ది తర్వాత జాన్వి టాలీవుడ్ లో కొనసాగుతుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం హిందీలో అమ్మడు ఈ ఇయర్ 3 సినిమాలు చేస్తుంది. పెద్ది మాత్రం నెక్స్ట్ ఇయర్ మార్చి రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.