మినీ స్కర్ట్ లో జాన్వీ కపూర్ అందాలు.. స్టైలిష్ లుక్ లో!
అతిలోక సుందరి అందాలతార దివంగత నటీమని శ్రీదేవి వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వి కపూర్ .
By: Madhu Reddy | 5 Jun 2026 2:50 PM ISTఅతిలోక సుందరి అందాలతార దివంగత నటీమని శ్రీదేవి వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వి కపూర్ . బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె తన తల్లి శ్రీదేవి కోరిక మేరకు తన మొదటి సినిమాను స్వర్గీయ నందమూరి తారక రావు మనవడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ యాక్షన్ మూవీ దేవర చిత్రం ద్వారా తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయింది జాన్వి కపూర్.
ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా తెలుగులో అవకాశాలు లభిస్తున్నాయి. అలా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమా నేడు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అచ్చియమ్మ పాత్రలో నటించింది. ఇక ఇలా ఒకవైపు భారీ చిత్రాలలో అవకాశాలు అందుకుంటూనే.. మరొకవైపు పలు బ్రాండ్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ఆ ఉత్పత్తులను ఉపయోగిస్తూ సోషల్ మీడియా ద్వారా సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఒక బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా స్టైలిష్ అవుట్ ఫిట్ లో కనిపించి ఆకట్టుకుంది జాన్వీ కపూర్.
తాజాగా ఒక ప్రముఖ వాణిజ్య సంస్థ ప్రకటనల్లో భాగంగా మినీ స్కర్ట్ ధరించి అందాలతో మెస్మరైజ్ చేసింది. ముదురు ఎరుపు రంగు వీ- నెక్ టాప్ ధరించిన ఈమె.. దీనికి సరిపోయే లీడ్ గ్రే కలర్ టెక్నికల్ సిల్క్ మినీ స్కర్ట్ ను ధరించింది. టాప్ పైన సిల్క్ బ్లౌసన్ జాకెట్ ధరించి తన మేకోవర్ను ఫుల్ ఫిల్ చేసుకుంది. ముఖ్యంగా ఈ బ్లౌసన్ జాకెట్ పై ప్రత్యేకమైన బ్లాక్ కలర్ డిజైన్ .. స్టాండప్ కాలర్ . 1980 నాటి శైలిలో రూపొందించిన ఓవర్ సైజ్డ్ సిల్హౌట్ ను ధరించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అవుట్ ఫిట్ కి సరిపోయేలా వే బ్లూ కలర్ లో ఉన్న లెదర్ హోబో బ్యాగ్ ను ధరించింది. ఇక కళ్ళకు అద్దాలు తొడిగి సింపుల్ లుక్ లో తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికి అయితే ఒక బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా ఆ బ్రాండ్ వస్తువులను దుస్తులను ధరించి ట్రెండీ లుక్ లో నెటిజన్స్ ను ఆకట్టుకుంది.
జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. పెద్ది సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె టైగర్ ష్రాఫ్ హీరోగా వస్తున్న లగ్ జా గాలే చిత్రంలో అవకాశాన్ని అందుకుంది . ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజు మెహతా దర్శకత్వం వహించారు. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో పాటు మిస్టర్ లేలే , హెలెన్ రీమేక్ చిత్రాలలో నటిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమాలన్నీ నిర్మాణం దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాల అధికారిక విడుదల తేదీలను ప్రకటించనున్నారు మేకర్స్.
