చరణ్ ఫ్యాన్స్‌కి కిక్కిస్తున్న జాన్వీ
ఇటీవల లాక్మేవీక్ లో స్పెషల్ కాన్సెప్ట్ తో రక్తి కట్టించిన జాన్వీ కపూర్.. వేదికపై తనదైన గ్లామర్ ని ఎలివేట్ చేస్తూ మతులు చెడగొట్టింది.
By: Tupaki Desk | 6 April 2025 4:00 AM ISTవరుస ఫోటోషూట్లతో అగ్గి రాజేస్తోంది జాన్వీ కపూర్. సాటి కథానాయికలతో పోలిస్తే జాన్వీ టూమచ్ బో* గా చెలరేగిపోతోంది. అందుకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా జాన్వీలోని అల్ట్రా గ్లామరస్ కోణం యువతరానికి స్పెషల్ ట్రీట్‌గా మారుతోంది.
ఇటీవల లాక్మేవీక్ లో స్పెషల్ కాన్సెప్ట్ తో రక్తి కట్టించిన జాన్వీ కపూర్.. వేదికపై తనదైన గ్లామర్ ని ఎలివేట్ చేస్తూ మతులు చెడగొట్టింది. ఈ భామ బోల్డ్ షో సోషల్ మీడియాను బ్రేక్ చేసింది. ఇంతలోనే మరో యూనిక్ ఫోటోషూట్ తో రెచ్చిపోయింది. ఈ అల్ట్రా స్టైలిష్ అల్ట్రా గ్లామ్ ఫోటోషూట్ నుంచి వరుస ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నాయి.
జాన్వీ టాలీవుడ్ లో అడుగు పెట్టాక మరింతగా రెచ్చిపోతోందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే మామ్ శ్రీదేవికి ఉన్న ఇమేజ్ కి భిన్నమైన ఇమేజ్ ని జాన్వీ సొంతం చేసుకుంటోంది. క్లాసిక్ డే నటి శ్రీదేవి గ్లామరస్ పాత్రల్లో నటించినా.. ట్రెడిషన్ పరంగా హద్దులు దాటలేదు. కానీ జాన్వీ అందుకు భిన్నమైన ఇమేజ్ ని తెచ్చుకుంటోంది. ఒక్కోసారి ఈ భామ చెలరేగి గ్లామర్ ని ఎలివేట్ చేస్తుంటే తనను ఉర్ఫీ జావేద్ తో పోలుస్తున్నారు. జాన్వీకి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ భామ పోస్టింగులు రక్తి కట్టిస్తున్నాయి. జాన్వీ సోషల్ మీడియా పోస్టింగులపై యూత్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా చరణ్ అభిమానులు జాన్వీ బోల్డ్ నెస్ పై రకరకాల కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
యంగ్ టైగర్ తో దేవర లాంటి బ్లాక్ బస్టర్ లో నటించిన జాన్వీ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన క్రీడా నేపథ్య చిత్రం పెద్దిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైతే జాన్వీకి మరింత మంచి పేరొస్తుందని భావిస్తున్నారు. ఇందులో జాన్వీకి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో బుచ్చిబాబు అవకాశం కల్పించాడని చెబుతున్నారు.
