అప్పట్లో శ్రీదేవి.. ఇప్పట్లో ధర్మేంద్ర.. మండిపడ్డ జాన్వీ కపూర్!
సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ప్రతి విషయం కూడా ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.
By: Tupaki Desk | 2 Dec 2025 12:00 PM ISTసినీ సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ప్రతి విషయం కూడా ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా అది వారి వ్యక్తిగత జీవితమైనా లేదా కెరియర్ విషయాలైనా ఇలా ఏదైనా సరే.. ఇకపోతే సెలబ్రిటీలకు సంబంధించి పాజిటివ్ గా వార్తలు స్ప్రెడ్ అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ నెగటివ్ గా ఒక్క వార్త వచ్చినా సరే అది వేగంగా విస్తరించి.. అటు సెలబ్రిటీలను కూడా మరింత బాధకు గురి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే బ్రతికున్న వారిని కూడా చనిపోయినట్టు చిత్రీకరిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు కూడా తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు.
ముఖ్యంగా ఇటీవల హీరో ధర్మేంద్ర విషయంలో కూడా ఇదే జరిగిన విషయం తెలిసిందే. ధర్మేంద్ర రెగ్యులర్ చెకప్ లో భాగంగా హాస్పిటల్ కి వెళ్లడంతో ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ మొదట వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఏకంగా చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం చేశారు. దీనికి తోడు అటు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దీంతో ధర్మేంద్ర కూతురు మండిపడుతూ తన తండ్రి చనిపోలేదని క్షేమంగా ఉన్నారని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ధర్మేంద్ర నవంబర్ 24న పలు అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.
బ్రతికుండగానే మరణించినట్లు ధృవీకరించి, ఆ కుటుంబ సభ్యులకు సోషల్ మీడియాలో కొంతమంది తీరని దుఃఖాన్ని మిగిలించారు. అయితే ఇదే విషయాన్ని తాజాగా దివంగత నటీమణి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తావిస్తూ.. తన తల్లిని కూడా గుర్తు చేసుకుంటూ.. సోషల్ మీడియా తీరుపై మండిపడింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సోషల్ మీడియా తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.." నా తల్లి శ్రీదేవి మరణం సమయంలో కూడా కొంతమంది సరదాగా మీమ్స్ వేయడం, విషయాన్ని వినోదంగా మార్చడం చూశాను. ఇటీవల ప్రముఖ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం గురించి కూడా తప్పుడు వార్తలు, ఊహగానాలు ప్రచారం చేస్తూ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. ఒకరి బాధ సోషల్ మీడియా వారికి సంతోషాన్ని కలిగిస్తోంది" అంటూ ఆమె విమర్శించింది.
అంతేకాదు బ్రతికున్న వారిని చనిపోయినట్టు చిత్రీకరించడం పై మండిపడింది జాన్వీ కపూర్. మొత్తానికైతే అప్పుడు శ్రీదేవి ఇప్పుడు ధర్మేంద్ర అంటూ సోషల్ మీడియా తీరుపై మండిపడుతూ జాన్వీ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. మరి ఇప్పటికైనా సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు తమ తీరును మార్చుకుంటారేమో చూడాలి.
జాన్వీ కపూర్ కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే యేడాది మార్చి 27న విడుదల కాబోతోంది.
