Begin typing your search above and press return to search.

జాన్వీ కపూర్‌ మరీ ఇంత ఓపెన్‌ అయ్యిందేంటి...!

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది.

By:  Tupaki Desk   |   14 July 2025 2:08 PM IST
జాన్వీ కపూర్‌ మరీ ఇంత ఓపెన్‌ అయ్యిందేంటి...!
X

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది. హిందీలో ఈమె చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. కానీ అందం వల్ల ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉండటంతో ఆఫర్లు వచ్చాయి. సోషల్‌ మీడియాలో ఈమె షేర్ చేసే అందాల ఆరబోత ఫోటోలు ఈమెకు స్టార్‌డంను తెచ్చి పెట్టాయి అనడంలో సందేహం లేదు. కొన్ని సినిమాలు కమర్షియల్‌గా విజయాన్ని సొంతం చేసుకోలేక పోయినా కూడా ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. దాంతో నటిగా జాన్వీ కపూర్‌ నిలదొక్కకుంది. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్‌ 'దేవర' సినిమాతో మొదటి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌, బుచ్చిబాబు కాంబో మూవీలో నటిస్తున్న విషయం తెల్సిందే.

జాన్వీ కపూర్‌ ప్రేమలో ఉందనే వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. ప్రియుడు శిఖర్‌తో కలిసి చాలా సందర్భాల్లో జాన్వీ కపూర్ కారులో, ప్రైవేట్‌ పార్టీల్లో కనిపించింది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం తాము ఇద్దరం ప్రేమలో ఉన్నామనే విషయాన్ని వెళ్లడించలేదు. కానీ ఇద్దరూ ఉంటున్న క్లోజ్‌ పిక్స్‌ను చూస్తే ఖచ్చితంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు, త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. తాజాగా మరోసారి జాన్వీ కపూర్ తన ప్రియుడితో కనిపించింది. మరోసారి ఆ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈసారి జాన్వీ కపూర్‌ ధరించిన డ్రెస్‌పై శిఖర్ అని ఉండటంతో చర్చనీయాంశం అవుతుంది.

సాధారణంగా ముద్దుగుమ్మలు తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచాలి అనుకుంటే కనీసం పేరును సోషల్‌ మీడియాలో కూడా మెన్షన్‌ చేయరు, ఒక్క ఫోటో బయటకు రానివ్వరు. కానీ జాన్వీ కపూర్‌ మాత్రం శిఖర్‌ పేరు ఉన్న టీ షర్ట్‌ను ధరించడంతో అంతా షాక్‌ అవుతున్నారు. బాబోయ్‌ జాన్వీ కపూర్ మరీ ఇంత ఓపెన్‌గా శిఖర్‌తో ఉన్న రిలేషన్‌ గురించి చెప్పేసింది ఏంటి అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. జాన్వీ కపూర్‌ ధరించిన టీ షర్ట్‌ గురించి ప్రస్తుతం ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఆమె సదరు టీ షర్ట్‌ ధరించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. ఆమె మాత్రం ఆ విషయమై నోరు విప్పేందుకు ఆసక్తిని కనబర్చడం లేదు.

ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్‌ ప్రేమ, పెళ్లి అంటే ఖచ్చితంగా కెరీర్‌ పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే జాన్వీ కపూర్‌ ప్రస్తుతానికి ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచుతుందేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నెట్టింట జాన్వీ కపూర్‌కి ఉన్న ఫాలోయింగ్‌ నేపథ్యంలో శిఖర్‌ అనే అక్షరాలు ఉన్న టీ షర్ట్‌ గురించి చర్చ పతాక స్థాయిలో జరుగుతుంది. జాన్వీ కపూర్‌ ఇంత ఓపెన్‌గా చెప్పిందంటే ఇక ముందు ముందు పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల వారు, విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దేవర సినిమా తర్వాత తెలుగులో రామ్‌ చరణ్‌కు జోడీగా బుచ్చిబాబు సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్‌ ఇప్పటికే మరో రెండు సినిమాలు కమిట్‌ అయిందనే వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి అల్లు అర్జున్‌, అట్లీ కాంబోలో రూపొందుతున్న మూవీ అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ సినిమాలో నలుగురు ఐదుగురు హీరోయిన్స్‌ కనిపించబోతున్నారని, అందులో జాన్వీ కపూర్‌ ఒక హీరోయిన్‌గా నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. మరో స్టార్‌ హీరోకు జోడీగా తెలుగులో నటించేందుకు గాను జాన్వీ కపూర్‌ ఓకే చెప్పింది. మొత్తానికి బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ తనకు ఫస్ట్‌ హిట్‌ ఇచ్చిన టాలీవుడ్‌ను మాత్రం వీడటం లేదు.