జాన్వీ కపూర్ ప్రేమాయణం ఎంతవరకూ!
జాన్వీకపూర్ -శిఖర్ పహారియా ప్రేమాయణం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఏడాది క్రితం వరకూ ఇద్దరి మధ్య ప్రేమ పరుగులు పెట్టిన వైనం తెలిసిందే.
By: Tupaki Desk | 27 Oct 2025 3:00 PM ISTజాన్వీకపూర్ -శిఖర్ పహారియా ప్రేమాయణం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఏడాది క్రితం వరకూ ఇద్దరి మధ్య ప్రేమ పరుగులు పెట్టిన వైనం తెలిసిందే. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంతగా బాండింగ్ హైలైట్ అయింది. కలిసి గుడులు గోపురాలు చుట్టేయడం...పార్టీలు..పబ్ లు అంటూ చాలాసార్లు మీడియా కంట చిక్కారు. అంబానీ ఇంట పెళ్లిలో ఏ రేంజ్ లో సందడి చేసారో తెలిసిందే. పార్టీ...డిన్నర్ వంటి చోట ఇరువురు ఒకరిపై ఒకరు కురిపించుకున్న ప్రేమ నెటి జనులకు ఓ బెస్ట్ మెమోరీ లాంటింది. ఇద్దరి మధ్య వేగం చూసి ఈ జంట కూడా త్వరలో వివాహ బంధంతో ఒకటి కావడం ఖాయమే అనుకున్నారంతా.
లండన్ లో బిజీ బిజీ:
అయితే నాలుగు నెలలుగా ఇద్దరు కలిసి పెద్దగా కనిపించలేదు. ఖాళీ దొరికితే ముంబై వీధుల్లో చక్కెర్లు కొట్టే జంట? ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నట్లున్నారు. జాన్వీ కపూర్ పూర్తిగా సినిమాలతోనే బిజీ అయింది. తెలుగు, హిందీ సినిమాలంటూ బిజీ బిజీగా గడుపుతుంది. శిఖర్ కపూర్ సెలబ్రిటీ కాకపోవడంతో అతడి గురించి వివరాలు బయటకు రాలేదు. శిఖర్ పహారియా కూడా ఖాళీగా ఉండేవారు కాదు. లండన్లోని అంతర్జాతీయ కంపెనీలో ఇన్వెస్ట్ మెంట్ అనలిస్ట్ గా పని చేస్తున్నాడు. అలాగే తండ్రి సంజయ్ పహారియాతో కలిసి వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాడు.
మీడియాకి కూడా చిక్కడం లేదా:
సాధారణంగా ప్రేమికులు ఎంత బిజీగా ఉన్నా? తమకంటూ కావాల్సిన ప్రయివేట్ స్పేస్ ను కల్పించుకుంటారు. రోజూ కలవడం సాధ్యం కాకపోయినా? వారంతంలో ఒక్కసారైనా కలవడానికి అవకాశం ఉంటుంది. జాన్వీ-శిఖర్ అలాంటి ప్రయత్నాలు చేయడం లేదా? లేక కలిసినా ఆకలయికను గోప్యంగా ఉంచుతున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఎంత గోప్యంగా ఉన్నా? ఏదో రూపంలో లీకులొస్తుంటాయి. అది సాయంత్రం సమయమైనా? నైట్ పార్టీ టైమ్ అయినా? ఏదో మీడియా కన్ను ద్వారా బయట పడుతుంది.
`పెద్ది` షూటింగ్ లో బిజీ:
కానీ ఆ ఛాన్స్ కూడా ఎక్కడా ఇవ్వనట్లే కనిపిస్తోంది. మరి అసలు కలుస్తున్నారా? లేక పనులంటూ ఎవరికి వారు బిజీగా ఉంటున్నారా? అన్నది తెలియాలి. జాన్వీ కపూర్ కొన్ని రోజులుగా తెలుగు సినిమా `పెద్ది` షూటింగ్ తో బిజీగా ఉంటోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ముంబై టూ వివిధ లోకేషన్లకు తిరుగుతుంది. ఎక్కువగా హైదరాబాద్లో స్టే చేస్తోంది. మొన్నటి వరకూ `సన్నీ సంస్కారీకి తులసీ కుమారీ` సినిమా ప్రచారం పనుల్లో బిజీగా ఉంది. ఆక్టోబర్ ఆరంభంలోనే ఆ సినిమా రిలీజ్ అవ్వడంతో `పెద్ది`కి బ్రేక్ ఇచ్చి ప్రచారం లో పాల్గొంది.
