Begin typing your search above and press return to search.

హీరోయిన్స్‌ నందు జాన్వీ కపూర్‌ వేరయ్యా...!

ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు, తెలుగులో ఒక సినిమాను చేస్తున్న జాన్వీ కపూర్‌ పారితోషికం గురించి షాకింగ్‌ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   19 July 2025 11:00 PM IST
హీరోయిన్స్‌ నందు జాన్వీ కపూర్‌ వేరయ్యా...!
X

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూనే ఉంది. గత ఆరు.. ఏడు ఏళ్లుగా జాన్వీ కపూర్‌ సినిమాలు చేస్తూనే ఉంది. కానీ ఇప్పటి వరకు అక్కడ హిట్‌ పడలేదు. నటిగా మంచి మార్కులు దక్కించుకుంటుంది, అందంతో కవ్విస్తుంది, ఆకర్షిస్తుంది. దాంతో జాన్వీ కపూర్‌కి వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈమె హిందీ ప్రేక్షకుల ముందుకు హోమ్బౌండ్ సినిమాతో వెళ్లింది. ఆ సినిమా సైతం జాన్వీ కపూర్‌కి మళ్లీ నిరాశను మిగిల్చింది. బాలీవుడ్‌లో ఈమె చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్‌లు అవుతున్నా పారితోషికం విషయంలో తగ్గడం లేదు. పై పెచ్చు సినిమా సినిమాకు పారితోషికం పెంచుతూ వస్తుందట.

ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు, తెలుగులో ఒక సినిమాను చేస్తున్న జాన్వీ కపూర్‌ పారితోషికం గురించి షాకింగ్‌ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. హిందీ సినిమాలకు నామమాత్రంగా వసూళ్లు చేస్తున్న జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ సినిమాలకు మాత్రం షాకింగ్‌ రేంజ్‌లో డిమాండ్‌ చేస్తుందట. దేవర సినిమాకు అప్పట్లో రూ.4.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య పారితోషికం తీసుకుందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు రామ్‌ చరణ్‌తో బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో నటిస్తున్నందుకు అంతకు మించి పారితోషికం అందుకుందట. దేవర సినిమా విడుదలకు ముందే ఆ సినిమా కమిట్‌ అయింది కాబట్టి సరే పారితోషికం ఎక్కువ డిమాండ్‌ చేసిందని అనుకోవచ్చు.

ఎన్టీఆర్‌ దేవర సినిమా భారీ ఓపెనింగ్స్ అయితే రాబట్టింది కానీ, సూపర్‌ హిట్‌ సినిమాల జాబితాలో నిలువలేదు అనేది వాస్తవం. అంతే కాకుండా ఆ సినిమాలో జాన్వీ కపూర్‌ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఆమె చేసిన చాలా హిందీ సినిమాలతో పోల్చితే దేవర సినిమాలో చేసిన పాత్ర పరిధి చాలా తక్కువగా ఉంది. అయినా కూడా ఆ స్థాయి పారితోషికం ఎలా అందుకుందని చాలా మంది బాలీవుడ్‌ వర్గాల వారు ముక్కున వేలేసుకున్నారట. జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో చేస్తున్న సినిమాలకు తీసుకుంటున్న పారితోషికం ఆమె గత చిత్రాల ఫలితాలతో పోల్చితే చాలా ఎక్కువే అని చెప్పాలి. ఇక ఆమె తెలుగు సినిమాలకు తీసుకుంటున్న పారితోషికం మరీ ఎక్కువ అనే టాక్‌ వినిపిస్తుంది.

జాన్వీ కపూర్‌ ప్రస్తుతం చేస్తున్న రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు సినిమా పారితోషికంను మించి మరో తెలుగు సినిమాకు డిమాండ్‌ చేసిందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమాలో నటించేందుకు గాను ఏకంగా రూ.6.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల మధ్య పారితోషికంను ఆమె డిమాండ్‌ చేసిందట. దాంతో నిర్మాతలు, మేకర్స్‌ అవసరమా అనే ఆలోచనలో ఉన్నారు. మంచి సినిమాలు చేయాలి, మంచి పాత్రలు చేయాలి, హిట్‌ కొట్టాలి అని కాకుండా జాన్వీ కపూర్‌ సినిమా సినిమాకు పారితోషికం పెంచుకుంటూ పోవాలి అనే ఆలోచన మంచిది కాదని, అది కెరీర్‌ను నాశనం చేస్తుందని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తెలుగులోనూ హిందీ సినిమాలకు తీసుకుంటున్నట్లుగా పారితోషికం తీసుకోవడం ఉత్తమం అని చాలా మంది సూచిస్తున్నారు. జాన్వీ మాత్రం తెలుగు, తమిళ సినిమాలు అనగానే పారితోషికంను ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచి చెబుతోంది.