కోటు జారవిడిచిన జాన్వీ వెంట పడ్డ ఫోటోగ్రాఫర్లు
ఫోటోగ్రాఫర్ల ముందు చెలరేగిపోవడంలో కపూర్ ఫ్యాషనిస్టా జాన్వీ తర్వాతే. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ 2025 లో జాన్వీ హవా మామూలుగా లేదు.
By: Tupaki Desk | 30 March 2025 2:15 PM ISTఫోటోగ్రాఫర్ల ముందు చెలరేగిపోవడంలో కపూర్ ఫ్యాషనిస్టా జాన్వీ తర్వాతే. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ 2025 లో జాన్వీ హవా మామూలుగా లేదు. కళ్లన్నీ జాన్వీపైనే..! మతి చెడే అందచందాలు.. అద్భుతమైన కాస్ట్యూమ్స్ లో జాన్వీ షో స్టాపర్ గా నిలిచింది. ర్యాంప్ పై అదిరిపోయే క్యాట్ వాక్ తో దూసుకొచ్చిన జాన్వీ వెంటపడి మరీ ఫోటోగ్రాఫర్లు పిచ్చెక్కి ఫోటోలు తీసారు.
అలా కోటు జారవిడిచి.. క్యాట్ వాక్ చేస్తున్న జాన్వీ రకరకాల భంగిమల్లో ఫోజులివ్వగా వాటిని క్యాప్చుర్ చేసేందుకు యంగ్ ఫోటోగ్రాఫర్స్ గుంపుగా మీది మీదికి ఉరికారు. కపూర్ ఫ్యాషనిస్టా జాన్వీ.. రాహుల్ మిశ్రా గౌనులో లక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్ పై మెరిసింది. బోల్డ్ వాక్‌తో జాన్వీ కపూర్ కవ్విస్తుంటే ఫోటోగ్రాఫర్ల క్లిక్‌లు డ్రమటిక్ గా అనిపించాయి.
స్టైల్ ఐకన్ జాన్వీ కపూర్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ మెరుపు ప్రత్యక్షమైనట్టే. తన మెరుపు.. గ్లామర్‌ను తనతో పాటు తీసుకువెళుతుంది... రాహుల్ మిశ్రా రన్‌వే కూడా అందుకు భిన్నంగా లేదు. సాంప్రదాయ భారతీయ వస్త్రధారణకు ఆధునికతను అద్దిన సమకాలీన డిజైన్ ని మిశ్రా బృందం అందించారు. ఈ గౌన్ విచిత్రమైన ప్రకృతి దృశ్యాల మేళవింపుతో ఆకర్షణీయంగా కనిపించింది. జాన్వీ స్ట్రాప్‌లెస్ గౌనులో అందంగా కాన్ఫిడెంట్ గా తనను తాను ఆవిష్కరించుకుంది. తన బాడీ ఫిగర్ ని ఎలివేట్ చేసే గ్రేజింగ్ ప్యాటర్న్- ప్లంగింగ్ నెక్‌లైన్ ఆకట్టుకున్నాయి. ఇటీవల టాలీవుడ్ లో దేవర లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ లో నటించిన జాన్వీ తదుపరి రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు చిత్రంలో నటిస్తోంది.
