డిజైనర్ చీరలో జాన్వీ హొయలు
జాన్వీ పలు సందర్భాల్లో హృదయాల్ని దోచుకునే ట్రెడిషనల్ డిజైనర్ చీరల్లో, కాంబినేషన్ ఆభరణాలతో ముగ్ధ మనోహరంగా కనిపించింది.
By: Tupaki Desk | 18 Jun 2025 10:03 AM ISTపూల్ సైడ్ బికినీ ట్రీట్ అయినా.. జిమ్ యోగా సెషన్స్ లో బాడీ ఫిట్ ట్రాక్ లతో హీటెక్కించడంలో అయినా నేటితరంలో జాన్వీ కపూర్ తర్వాతే. ట్రెడిషనల్ శారీలోను హృదయాల్ని కొల్లగొట్టే వైబ్స్ ని తేవడంలో ఎప్పుడూ విఫలం కాదు. బాలీవుడ్ లో ట్రెండింగ్ స్టార్‌గా కొనసాగడంలో కపూర్ ఫ్యాషనిస్టా ఫ్యాషన్ సెన్స్, ఎంపికల్ని కాదనలేం.
జాన్వీ పలు సందర్భాల్లో హృదయాల్ని దోచుకునే ట్రెడిషనల్ డిజైనర్ చీరల్లో, కాంబినేషన్ ఆభరణాలతో ముగ్ధ మనోహరంగా కనిపించింది. అలాంటి ఒక చీరందాన్ని ఇక్కడ ప్రదర్శిస్తే, ఈ చీరలో ప్రత్యేకత ఏమిటో యూత్ వర్ణించడంలో బిజీగా మారింది. పింక్ చీరలో గుబులు పెంచింది జాన్వీ. పాక్షికంగా అందాల్ని ఎలివేట్ చేసే ఈ చీరను క్రిస్టలైన్ బార్డర్ తో అందంగా రూపొందించగా, ఎంపిక చేసిన బ్లౌజ్ పచ్చందంతో క్రిస్టలైన్ డిజైన్ తో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
ఆసక్తికరంగా జాన్వీ ధరించిన ఆ స్పెషల్ నెక్టెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది తెలుపు మెరూన్ కలయికతో రూపొందించిన డిజైనర్ నెక్లెస్. ఆ అందమైన నెక్‌లైన్‌పై సులభంగా కళ్లు తిప్పుకునేలా అందమైన లారియట్ నెక్లెస్‌ను ఎంపిక చేసుకుంది. ఈ నెక్లెస్ ధగధగలు జాన్వీ అందాన్ని పదింతలు పెంచాయి. చీరలు, లెహంగాలు సహా సాంప్రదాయ లేదా అధికారిక ఇండియన్ స్టైల్ దుస్తులతో ఈ నెక్లెస్ ని ధరిస్తారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే .. జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తోంది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తదుపరి తమిళ హీరో సూర్య సరసన ఓ చిత్రంలో జాన్వీ కపూర్ నటించనుందని కథనాలొస్తున్నాయి. కానీ ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
