Begin typing your search above and press return to search.

ఊహించ‌ని ట్విస్ట్ కు జాన్వీ సిద్దంగా!

అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ ఇప్ప‌టికే బాలీవుడ్..టాలీవుడ్ లో స‌త్తా చాటు తుంది.

By:  Tupaki Desk   |   24 April 2025 2:45 PM
ఊహించ‌ని ట్విస్ట్ కు జాన్వీ సిద్దంగా!
X

అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ ఇప్ప‌టికే బాలీవుడ్..టాలీవుడ్ లో స‌త్తా చాటు తుంది. న‌టిగా తిరుగు లేకుండా దూసుకుపోతుంది. ఏకంగా స్టార్ హీరోలే టార్గెట్ గా సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ కంటే గొప్ప అవ‌కాశాలు టాలీవుడ్ లో అందుకుంటుంది. ఇదంతా కేవ‌లం శ్రీదేవి పై ఉన్న అభిమానంతో సాధ్య‌మ‌వుతుంది? అన్న‌ది అంతే వాస్త‌వం. జాన్వీ ట్యాలెంట్ చూసి వ‌చ్చిన అవ‌కాశాలు కావివి.

టాలీవుడ్ తో శ్రీదేవికి ఉన్న అనుబంధం..ఆ ఇమేజ్ తోనే ఇక్క‌డ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. లేదంటే అంత ట‌ప్ కాంపిటీష‌న్ లో ఎంతో మంది ట్యాలెంటెడ్ భామ‌ల్ని ప‌క్క‌న బెట్టి జాన్వీకి ఎలా క‌ట్ట‌బెడ‌తారు అవ‌కా శాలు. ఇది అంతా అంగీక‌రించాల్సిన వాస్త‌వం. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే జాన్వీ కపూర్ కోలీవుడ్ లాంచింగ్ పై కూడా ఆస‌క్తి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డు అర‌వ ప్రాంతానికి ఎప్పుడు వెళ్తుందంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద డిబేట్ సైతం న‌డిచింది.

అక్క‌డా టాలీవుడ్ త‌ర‌హాలో కోలీవుడ్ స్టార్లను టార్గెట్ చేస్తుందా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ కోలీవుడ్ లో జాన్వీ ఎంట్రీ ఓ వెబ్ సిరీస్ తో షురూ చేస్తుంది. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో జాన్వీ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ వెబ్ సిరీస్ కు స‌న్నాహాలు చేస్తున్నారు. కొన్ని నెల‌లుగా రంజిత్ తో జాన్వీ ట‌చ్ లో ఉన్న‌ట్లు ..చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇది కంప్లీట్ గా జాన్వీని మెయిన్ లీడ్ లో పెట్టి చేస్తోన్న వెబ్ సిరీస్ .

అణిచివేత‌, సామాజిక స‌మ‌స్య‌లే ప్ర‌ధాన అంశంగా హైలైట్ చేస్తున్నారు. జులైలో షూటింగ్ మొద‌ల వుతుంది. మొత్తానికి జాన్వీ తొలి వె బ్ సిరీస్ ఈ విధంగా షురూ అవుతుంద‌ని తాను కూడా ఊహించి ఉండ‌దు. ఇంత వ‌ర‌కూ అమ్మ‌డు బాలీవుడ్ లో కూడా వెబ్ సిరీస్ లు చేయ‌లేదు. అక్క‌డ వ‌చ్చిన అవ‌కాశాలు సైతం కాదంది. కానీ కోలీవుడ్ లో వెండి తెర‌కంటే ముందు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది.