అలా అయినా ఛాన్స్ వచ్చిందని సంతోషించండి
ఈ విషయంపై బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ ను పెట్టింది.
By: Tupaki Desk | 8 May 2025 6:00 PM ISTవరల్డ్ లోనే అతి పెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా. ప్రతీ ఏడాది మే నెల మొదటి వారంలో ఈ ఈవెంట్ జరుగుతుంది. మెట్ గాలా 2025న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ లో ఆల్రెడీ ప్రారంభమైంది. ప్రపంచంలోని ఎంతోమంది సెలబ్రిటీల్లో అతి తక్కువ మందికి మాత్రమే ఈ ఈవెంట్ లో పాల్గొనే ఛాన్స్ వస్తుంది.
అలా అని డబ్బు, పేరు ఉన్న వాళ్లంతా ఈ ఈవెంట్ కు వెళ్లలేరు. ఈ ఈవెంట్ కు వెళ్లాలంటే చాలా భారీ మొత్తంలో డబ్బులు కట్టడంతో పాటూ ఎంతో ముందుగానే దాని కోసం డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది. అంత భారీగా ఖర్చు పెట్టినప్పటికీ ఆ ఈవెంట్ కు వెళ్లాలంటే మెట్ గాలా పెట్టిన కండిషన్స్ ను అనుసరించాల్సిందే.
ఆఖరికి ఆ ఈవెంట్ లో ఏ రంగు బట్టలు వేసుకోవాలనేది కూడా ఆ ఈవెంట్ నిర్వాహకులే డిసైడ్ చేస్తారు. ఈవెంట్ కు వెళ్లే సెలబ్రిటీలు కొన్ని నెలల ముందే వారి కాస్ట్యూమ్స్ ను మెట్ గాలా టీమ్ కు పంపి వాళ్లు ఓకే అన్న తర్వాతే వాటిని ధరించాల్సి ఉంటుంది. అంతటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ కు ఈ సారి ఇండియా నుంచి షారుఖ్ ఖాన్, కియారా అద్వాణీ, ప్రియాంక చోప్రా లాంటి సెలబ్రిటీలు హాజరయ్యారు.
అయితే ఈ ఈవెంట్ లో మన సెలబ్రిటీలు వేసుకున్న కాస్ట్యూమ్స్ ఎవరికీ పెద్దగా నచ్చలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తూ వారి కాస్ట్యూమ్స్ విషయంలో పెదవి విరుస్తున్నారు. ఈ విషయంపై బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ ను పెట్టింది.
మన దగ్గర ఉన్న డిజైనర్లు, చేతి వృత్తుల వారు వరల్డ్ లోనే బెస్ట్ అని, ఇలాంటి ఫేమస్ స్టేజ్ పై మన ఇండియన్ టాలెంట్ ను చూసి బాధపడకుండా, మనకు దక్కాల్సిన గౌరవం, అర్హత ఇలా దక్కుతుందని సంతోషించమని జాన్వీ కపూర్ తెలిపింది. కొన్ని దశాబ్దాలుగా మన చేతివృత్తుల వారి పనిని మనం ఎగుమతి చేసి ప్రపంచ వేదికలపై ప్రదర్శిస్తున్నప్పటికీ వారికి ఎలాంటి క్రెడిట్ దక్కడం లేదని, ఇప్పుడు ఇలా మన కళాకారులకు వారి టాలెంట్ ప్రదర్శించే అవకాశం వచ్చినందుకు తనకెంతో సంతోషంగా ఉందని, మెట్ గాలా లో మనవాళ్లు పాల్గొనడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నట్టు జాన్వీ రాసుకొచ్చింది.
